మెదక్.. కేసీఆర్, నిజామాబాద్.. కవిత
హైదరాబాద్: టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను మంగళవారం విడుదల చేశారు. 8 లోక్సభ 30 శాసనసభ స్థానాల అభ్యర్థులను టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గత ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి గెలిచిన కేసీఆర్ ఈసారి మెదక్ నుంచి బరిలో దిగనున్నారు. కేసీఆర్ కుమార్తె, జానజాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ మూడు విడతల్లో మొత్తం 17 లోక్ సభ, 96శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో విద్యార్థి నాయకుడు బాల్కా సుమన్, సీపీఐ తాజా మాజీ ఎమ్మెల్యే చంద్రావతికి చోటు దక్కింది.
లోక్ సభ అభ్యర్థుల జాబితా:
మెదక్ - కేసీఆర్, నిజామాబాద్ - కవిత, జహీరాబాద్ - బీవీ పటేల్, పెద్దపల్లి - బాల్కా సుమన్, ఆదిలాబాద్ - నగేష్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, ఖమ్మం - బేగ్ షేక్, హైదరాబాద్ - రషీద్ షరీఫ్
అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:
ఉప్పల్ - సుభాష్ రెడ్డి, చార్మినార్ - ఇనాయత్ అలీ బాక్రీ
మలక్‌పేట్ - సతీష్ యాదవ్, చాంద్రాయణగుట్ట - సీతారాం రెడ్డి
ఖైరతాబాద్ - ఎం.గోవర్ధన్‌రెడ్డి, అంబర్‌పేట్ - సుధాకర్‌రెడ్డి
కార్వాన్ - ఠాకూర్ జీవన్‌సింగ్, ఖమ్మం - జి.కృష్ణ
పినపాక - డా. శంకర్‌నాయక్, మధిర - బొమ్మెర రామ్మూర్తి
వైరా - చంద్రవతి, కుత్బుల్లాపూర్ - కొలను హన్మంతరెడ్డి
సనత్‌నగర్ - విఠల్, మంచిర్యాల - దివాకర్‌రావు
నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్త
నారాయణ ఖేడ్ - భూపాల్‌రెడ్డి
కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు
కొడంగల్ - గుర్నాథరెడ్డి
మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి, గోషామహల్ - ప్రేమ్ కుమార్
యాకత్‌పుర - ఎం.డి.షబ్బీర్ అలీ
ఎల్బీనగర్ - రామ్మోహన్ గౌడ్
అశ్వారావుపేట - జయ ఆదినారాయణ
పరకాల-సహోదర్‌రెడ్డి, నాగార్జునసాగర్- నోముల నర్సింహయ్య
భువనగిరి- పైలా శేఖర్‌రెడ్డి, చొప్పదండి- శోభా
జహీరాబాద్- మాణిక్‌రావు
మహబూబాబాద్- బానోతు శంకర్ నాయక్
నర్సాపూర్ - మదన్‌రెడ్డి
మహబూబాబాద్- బానోతు శంకర్ నాయక్