సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమీక్షించడానికి వీలుగా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఫలితాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా కౌంటింగ్ కేంద్రాల వద్దనే అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కె.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్, రామలక్ష్మణ్ వంటి వారిని ఉదయమే తన వద్దకు రావాలని కోరారు.