కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తడు: ఎర్రబెల్లి | kcr sale for telengan - errabelli | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తడు: ఎర్రబెల్లి

Published Wed, Apr 16 2014 2:25 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తడు: ఎర్రబెల్లి - Sakshi

కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తడు: ఎర్రబెల్లి

పాలకుర్తి, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కేసీఆర్  తెలంగాణ అమ్మేస్తాడని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో మంగళవారం మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్‌కు 30, టీఆర్‌ఎస్ పార్టీకి 20సీట్లు మించవన్నారు.  టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పార్టీగానే మిగిలి పోతుందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ నేడు తన కుటుంబ సభ్యులకే అధికారం కావాలంటున్నాడని విమర్శించారు.  తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement