ప.గో:జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామి రెడ్డి మండిపడ్డారు. బీజేపీ-టీడీపీల కూటమికి ఎన్నికల ప్రచారం చేపట్టిన పవన్.. ఏం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగించేటప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాడా?లేక ఏదో ఆకర్షణ కోసం ఆవేశంగా మాట్లాడుతున్నాడో అంతుచిక్కని విధంగా ఉందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కు లేదన్నారు. జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే కాంగ్రెస్ ను ఎదురించి పోరాడన్నారు. ఆ విషయాన్ని పవన్ ముందుగా తెలుసుకుని మాట్లాడాలని కోదండరామి రెడ్డి సూచించారు.
రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేసింది జగన్ ఒక్కడేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ ఒంటిరి చేసి నిందలు వేస్తుండటం ఎంతమాత్రం సరికాదని ఆయన సూచించారు. మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా ఏమిటో చూపిస్తారన్నారు.