ఖబడ్దార్ పవన్‌కల్యాణ్ ! | p prabhu gowda takes on pavan kalyan | Sakshi
Sakshi News home page

ఖబడ్దార్ పవన్‌కల్యాణ్ !

Published Wed, May 7 2014 12:10 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

ఖబడ్దార్ పవన్‌కల్యాణ్ ! - Sakshi

ఖబడ్దార్ పవన్‌కల్యాణ్ !

 జోగిపేట, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అవాకులు చెవాకులు పేలితే తగిన బుద్ధిచెబుతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ హెచ్చరించారు. మంగళవారం జోగిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి ఆలవాలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కేంద్ర మంత్రి చిరంజీవి గురించి మాట్లాడని పవన్ కల్యాణ్  ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే భయంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ, బీజెపీ పార్టీలకు అమ్ముడుపోయిన ఆయనకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హతలేదన్నారు.

దమ్ముంటే చిరంజీవి హఠాఓ ..సీమాంధ్ర బచాఓ అని పిలుపు ఇవ్వాలన్నారు. డబ్బులు తీసుకొని సినిమాల్లో డైలాగులు చెప్పేందుకు అలవాటు పడిన ఆయన చంద్రబాబు, నరేంద్రమోడీ వద్ద డబ్బులు తీసుకొని వారు రాసి ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని విమర్శించారు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు డిజీ మల్లయ్య యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలకృష్ణారెడ్డి, పద్మనాభరెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు వెంకటరమణలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
 
 పార్టీ నేతకు పరామర్శ
 వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డీజీ మల్లయ్య యాదవ్‌ను మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ జోగిపేటలో  పరామర్శించారు. మల్లయ్య యాదవ్‌కు ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది.ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ప్రభుగౌడ్ పరామర్శించారు. ఆయన వెంట పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలకృష్ణారెడ్డి, పద్మనాభరెడ్డి, కిష్టారెడ్డి, జిల్లా నాయకులు వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement