'పవన్ పేరుకు తగినట్టే గాలి మాటలు, సొల్లు కబుర్లు' | YSRCP Leader Sharmila criticises Pawan Kalyan | Sakshi
Sakshi News home page

'పవన్ పేరుకు తగినట్టే గాలి మాటలు, సొల్లు కబుర్లు'

Published Sun, May 4 2014 5:30 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్ పేరుకు తగినట్టే గాలి మాటలు, సొల్లు కబుర్లు' - Sakshi

'పవన్ పేరుకు తగినట్టే గాలి మాటలు, సొల్లు కబుర్లు'

రంపచోడవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల నిప్పులు చెరిగారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ పేరుకు తగ్గట్టే చెప్పేవన్ని గాలి మాటలు, సొల్లు కబుర్లు  అని అన్నారు. రోజుకో మాట, పూటకో బాట పట్టే  పవన్‌ కళ్యాణ్కు విలువలు లేవు, విశ్వసనీతయ లేవు అని అన్నారు. పవన్‌కు ఉన్నదంతా తిక్కే షర్మిల మండిపడ్డారు. 
 
వైఎస్ఆర్ సీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని,  2004లో మహా కూటమితో వైఎస్‌ ముందు నిలవలేకపోయారని, ఇప్పుడు ఆయన తనయున్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు గుజరాత్ నుంచి మోడీని తెచ్చుకున్నారని, అధికారం కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. 
 
పవన్, చంద్రబాబు కొత్తగా పెళ్లైన మొగుడు, పెళ్లాంల ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.  పవన్ కళ్యాణ్‌ మాటలు ఆయన అభిమానులకే అర్థం కావడం లేదని, ఊసరవెల్లికంటే వేగంగా పవన్, బాబులు రంగులు మారుస్తారన్నారు.  2009 ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి పరుడని తిట్టిన పవన్ ఇప్పుడు ఓటేయమంటున్నాడని షర్మిల అన్నారు.  పవన్ కళ్యాణ్‌కున్న విశ్వసనీయత అదని, విభజన వాదులతో కలిసి పవన్ చిందేస్తున్నాడని రంపచోడవరంలో షర్మిల విమర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement