: మహబూబ్నగర్ జిల్లాలో మొదటి ఓటు హక్కును జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ వినియోగించుకున్నారు.
మహబూబ్నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి ఓటు హక్కును జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ బుధవారం ఉదయం వినియోగించుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కలెక్టర్.... సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్పెషల్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కొల్లాపూర్, అచ్చంపేటలు సమస్యాత్మక ప్రాంతాలైనప్పటికీ స్ధానికుల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5గంటల వరకు పొడిగించినట్లు కలెక్టర్ చెప్పారు. మిగిలిన 12 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని గిరిజాశంకర్ తెలిపారు.