ప్రధాని పదవికి ములాయం అన్ని విధాల అర్హుడు | Mulayam Singh Yadav most able for Prime Minister post, says akhilesh yadav | Sakshi
Sakshi News home page

ప్రధాని పదవికి ములాయం అన్ని విధాల అర్హుడు

Published Tue, Apr 15 2014 7:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ప్రధాని పదవికి ములాయం అన్ని విధాల అర్హుడు - Sakshi

ప్రధాని పదవికి ములాయం అన్ని విధాల అర్హుడు

ఫిరోజాబాద్:ప్రధానికి పదవికి ములాయం సింగ్ అర్హుడని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రధాని పదవిని చేపట్టేందకు ములాయంకు అన్ని అర్హతలున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఎన్నికల రో్డ్ షోలో పాల్గొన్న అఖిలేష్ ..వరుసకు సోదరుడైన అక్షయ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రిని వెనకేసుకొచ్చారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడుతూనే తండ్రి ములాయంను ప్రధానిని చేద్దామని విజ్ఞప్తి చేశారు. అమర్యాదకరంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మోడీ ప్రధాని అయితే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు.

 

ఇటువంటి వారిని ప్రధానిగా ఊహించుకోవడం కష్టతరమైన అంశమన్నారు. అతని కంటే ములాయంకు రాజకీయాల్లో విశేష అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రిగా చేసిన రికార్డు ఉందని తెలిపారు. ప్రధాని పదవికి అన్ని రకాలు లక్షణాలున్న ములాయంను గద్దెనెక్కించే దిశగా కృషి చేయాలని ఓటర్లుకు అఖిలేష్ పిలుపునిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement