
నన్ను జైలుకు పంపాలనుకుంది
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పరస్పరం విమర్శనాస్త్రాలకు పదును పెట్టాయి. తనను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ సమయూనికి మించి పనిచేసిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు.
కాంగ్రెస్‌పై మోడీ ధ్వజం
రాహుల్ అహంభావి అయిన రాకుమారుడని విమర్శ
ప్రపంచం మోడీని నమ్మదన్న కాంగ్రెస్
బర్మేర్ (రాజస్థాన్), న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పరస్పరం విమర్శనాస్త్రాలకు పదును పెట్టాయి. తనను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ సమయూనికి మించి పనిచేసిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం అప్రజాస్వామికమైన రాజవంశ సంస్కృతిని పెంచి పోషిస్తోందన్న మోడీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అహంభావి అయిన రాకుమారుడిగా అభివర్ణించారు.
మోడీని ఓ విచ్ఛిన్నకారుడిగా పేర్కొన్న కాంగ్రెస్.. ఆయన్ను ప్రపంచం నమ్మే పరిస్థితి లేదని ఓ బ్రిటిష్ పత్రికను ఉటంకిస్తూ ధ్వజమెత్తింది. శనివారం మోడీ రాజస్థాన్‌లోని బర్మేర్, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, షిర్డీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీబీఐ తనను ఇరికించేందుకు రోజులో 24 గంటలూ పని చేసిం దని ఆరోపించారు. ‘మేడమ్ సోనియూ ప్రభుత్వం, ఏజెంట్లు నన్ను నాశనం చేసేందుకు కష్టపడి పని చేశారు. చివరకు ఏమైంది? నేను సచ్చీలుడిగా బయటకు వచ్చా..’ అని మోడీ పేర్కొన్నారు. ప్రజలకు తాము జవాబుదారులమని సోనియూ, రాహుల్ ఎప్పుడూ భావించరన్నారు.
దేశానికి కావాల్సింది పాలకులు కాదని, పార్లమెంటులో పనిచేసే సేవకులని చెప్పారు. కాంగ్రెస్ ఇంతకుముందెన్నడూ చూడని గడ్డు రోజులను ఈ ఎన్నికల తర్వాత చూడబోతోందన్నారు. ఇలావుండగా బ్రిటన్‌కు చెందిన గార్డియన్ వార్తాపత్రిక మోడీ అభివృద్ధి నమూనాలోని విశ్వసనీయతను ప్రశ్నించినట్టు కాంగ్రెస్ శనివారం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
2002లో గుజరాత్‌లో జరిగిన ఘర్షణల్లో మోడీ పాత్రను కూడా ఆ పత్రిక తప్పుబట్టినట్టు తెలిపింది. గార్డియన్ పత్రిక ఏప్రిల్ 7 ఎడిషన్‌లో వెలువడిన ఓ అభిప్రాయూన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. ప్రపంచం మోడీని విశ్వసించడం లేదు. మరి మీరు? అంటూ.. ‘మోడీ.. రక్తం అంటిన చేతులు కలిగిన ఈ వ్యక్తి భారత్‌కు సరైన ప్రత్యామ్నాయం కాదు’ అనే శీర్షిక కలిగిన వ్యాసంలో కాంగ్రెస్ ప్రశ్నించింది. మోడీ ఎట్టకేలకు తన వైవాహిక హోదాను అంగీకరించడంపై దిగ్విజయ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.