'వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే....' | Only YSRC can bring 'YSR Rajyam,' says YS Sharmila | Sakshi
Sakshi News home page

'వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే....'

Published Wed, Mar 26 2014 12:47 PM | Last Updated on Tue, Aug 14 2018 5:06 PM

'వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే....' - Sakshi

'వినేవారుంటే ఆరోగ్యశ్రీ కూడా నాదే....'

నూజివీడు : 'జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయం తెచ్చుకుందాం...ఒక్క అవకాశం ఇవ్వండి..మీ కోసం జగనన్న తన జీవితాన్ని ధారపోస్తాడు' అని వైఎస్ షర్మిల కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం కృష్ణాజిల్లా నూజివీడులో ప్రసంగించారు. వైఎస్ఆర్ సీపీకి ఓటేద్దాం.. రాజన్నరాజ్యం తెచ్చుకుందామని షర్మిల  పిలుపునిచ్చారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరివరకూ పోరాటం చేసిందని ఆమె తెలిపారు.

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ షర్మిల ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు అయిదేళ్లలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ను బాబు భుజాన మోసి.... విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారని షర్మిల అన్నారు.


చంద్రబాబుకు తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచనే రాలేదని షర్మిల ఎద్దేవా చేశారు. వినేవారుంటే ఆరోగ్యశ్రీ కాఊడా నాదే..ఫీజు రీయింబర్స్మెంట్, 108 కూడా నాదే అని అబద్దాలు చెబుతారని అన్నారు.

చంద్రబాబు ఏ రోజు అయితే నిజం చెబుతారో... ఆరోజు ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని ఒక ముని శాపముందట...అని షర్మిల వ్యాఖ్యాంచారు. అందుకే చంద్రబాబు మాటల్లో నిజం లేదని ...విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలీదని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే దానికి బాబు మద్దతు తెలిపారన్నారు. చంద్రబాబు ఒక ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాన్ని...మరో ఎలక్షన్ వచ్చేసరికి మర్చిపోతారని షర్మిల విమర్శించారు. పనిలో పనిగా చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని కిరణ్ మోపారన్నారు. ఓటేసిన ప్రజలను పిచ్చోళ్ళను చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపిన చరిత్ర చిరంజీవిదని షర్మిల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement