
పొత్తు అనేది పెళ్లి లాంటిది
టీడీపీ-బీజేపీ మధ్య పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పొత్తు అనేది పెళ్లి లాంటిదని... పూర్తిగా జరగాలి కానీ సగం సగం జరగకూడదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
కాగా పొత్తు లేకపోతే నష్టపోతామన్న భావనతో బీజేపీ అడిగినన్ని సీట్లను ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధపడినప్పటికీ ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఎలాగైనా సరే కమలనాథులతో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో మంతనాలు జరుపుతున్నా ఇరు పార్టీల మధ్య బంధం పటిష్టం కావడంలేదు.