సాక్షి, అనంతపురం : ఓటమి భయంతో బెదిరింపుల పర్వానికి రఘువీరారెడ్డి తెరలేపుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఓడితే పరువు పోతుందన్న భావనతో మాట వినకపోతే పాతకేసులు తిరగదోడతామని పోలీసుల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తాను ప్రాతినిథ్యం వహించిన కళ్యాణదుర్గం నుంచి ఈసారి పోటీ చేస్తే ఓడిపోతానన్న భావనకు వచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో పెనుకొండను ఎంచుకున్నారు.
అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడిపోగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇది తెలుసుకున్న రఘువీరా ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా రఘువీరా విజయానికి కృషి చేయకపోతే పాత కేసులు తిరగదోడి ఇబ్బందులకు గురి చేస్తామని ఆయన వర్గీయులు, కొందరు పోలీసులు నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు.
గ్రామాల్లో ఇప్పటి నుంచే డబ్బుల పంపిణీకి శ్రీరాం చుట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న బీకే పార్థసారథి టీడీపీ తరఫున పోటీలో వున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ రంగంలో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో ఎక్కువగా వ్యతిరేకత కన్పిస్తోంది. దీంతో కురుబ సామాజిక వర్గానికి చెందిన వారిలో అత్యధికులు ఈ సారి శంకర్ నారాయణ విజయం కోసం క ృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 11 శాఖలకు మంత్రిగా వ్యవహరించి రాష్ర్టంలో ఒక వెలుగు వెలిగిన ఎస్.రామచంద్రారెడ్డి కుమారుడు నాగరాజరెడ్డి ప్రస్తుతం శంకర్‌నారాయణ వెంటే వుంటున్నారు. ఆయన బంధుగణం అంతా కూడా బీకే పార్థసారథిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడిగేందుకు రావడం తప్ప ఈ ప్రాంత అభివ ృద్ధిపై పార్థసారథి ఎప్పుడూ ద ృష్టి పెట్టలేదని వారంటున్నారు. కేవలం తన సంపాదనకే ఎక్కువ సమయం గడిపాడనే ఆరోపణలు కూడా పార్థపై తీవ్ర స్థాయిలో వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంకర నారాయణను గెలిపిద్దామన్న ధ ృడ సంకల్పంతో అంతా ముందుకు సాగుతున్నారు.
దీనికి తోడు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఓటర్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రభుత్వ పథకాలు తమ దరి చేరుతాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఏ గ్రామానికి వెళ్తున్నా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇదిలా వుండగా మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సిట్టింగ్ స్థానమైన కళ్యాణదుర్గం కాదని ఈ ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేయడం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన పరిటాల సునీత ఒత్తిడి కూడా వుందని టీడీపీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఇందులో భాగంగానే ఆమె వర్గంగా ముద్ర పడిన మాజీ ఎంపీపీ మునిమడుగు చిన్న వెంకటరాముడును కాంగ్రెస్‌లో చేర్పించడం.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి హిందూపురం పార్లమెంటు స్థానానికి టిక్కెట్ ఇప్పించడంలోనూ సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. బోయ సామాజిక వర్గానికి చెందిన చిన్న వెంకటరాముడు ద్వారా ఆ సామాజిక వర్గానికి చెందిన కొన్ని ఓట్లతో పాటు అంతో ఇంతో కాంగ్రెస్‌కు ఉన్న ఓట్లు, పరిటాల సునీత వర్గంగా ముద్ర పడిన కొందరు తన విజయానికి క ృషి చేస్తారని రఘువీరారెడ్డి భావిస్తున్నారు.
వీటికి తోడు పాత కేసుల్లో వున్న వారిని గుర్తించి ఈ సారి కాంగ్రెస్ విజయానికి క ృషి చేయాలని కొందరు పోలీసుల ఒత్తిడి తెస్తున్నారు. వినకపోతే పాత కేసులను తిరగతోడి మళ్లీ కేసులు బనాయిస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే తప్పుడు కేసులు బనాయించి అయినా దారికి తేవాలని, ఇందుకోసం రఘువీరా కొందరు పోలీసు అధికారులకు భారీ మొత్తం ముట్టజెప్పినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల ఒత్తిడిని తిప్పికొడుతూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
చెప్పినట్లు వినండి
Published Fri, Apr 25 2014 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement