వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్తో కలిసి రాహుల్ రోడ్షో. ఇన్సెట్లో రాజ్ బర్బర్, నగ్మా
వారణాసి: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లోక్సభకు పోటీ చేసే వారణాసిలో కాంగ్రెస్, బిజెపి, ఆమ్ఆద్మీ పార్టీలు పోటాపోటీగా రోడ్షోలు నిర్వహించాయి. ప్రచారానికి ఈరోజు ఇక్కడ చివరి రోజు కావడంతో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేశారు. దాదాపు పది కిలో మీటర్ల దూరం రోడ్షో నిర్వహించారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
నిన్న కేజ్రీవాల్, మొన్న నరేంద్ర మోడీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమీపంలో తమతమ రోడ్షోలు ప్రారంభిస్తే, రాహుల్ గాంధీ ఈరోజు తన రోడ్షోను అక్కడే ముగించారు. రాహుల్ రోడ్షోలో కాంగ్రెస్ ప్రముఖులు గులామ్ నబీ ఆజాద్, మధుసూధన్ మిస్త్రీ, సిపి జోషితోపాటు సినిమా నటులు రాజ్బర్బర్, నగ్మా వంటి వారు పాల్గొన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ఉద్దేశంతో బెనియా బాగ్లో నరేంద్ర మోడీ రోడ్షో నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. అయితే ఈరోజు అదే ప్రాంతంలో రాహుల్ రోడ్షో నిర్వహించారు.
ఈ రోజు రోడ్షో పూర్తి అయిన తరువాత గుజామ్ నబీ ఆజాద్ మాట్లాడుతూ తమ అభ్యర్థి అజయ్ రాయ్ విజయం వంద శాతం తథ్యం అని ధీమా వ్యక్తా చేశారు.