మోడీ హవా లేదు | Priyanka Gandhi to campaign for Rahul, husband Robert Vadra to stay away | Sakshi
Sakshi News home page

మోడీ హవా లేదు

Published Fri, Apr 11 2014 1:53 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

మోడీ హవా లేదు - Sakshi

మోడీ హవా లేదు

న్యూఢిల్లీ: తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి, అమేథీ నియోజకవర్గాల్లో ప్రచారానికే తాను పరిమితమవుతానని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో మరిన్ని బాధ్యతలు స్వీకరించడానికి ప్రస్తుతం తాను సిద్ధంగా లేనని తెలిపారు. బీజేపీ చెబుతున్నట్లు దేశంలో ఎక్కడా మోడీ హవా కనిపించడం లేదన్నారు.
 
 తన భర్త రాబర్ట్ వాద్రాతో పాటు ఇక్కడి లోధీ ఎస్టేట్ పోలింగ్ బూత్‌లో గురువారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రియాంక కీలక బాధ్యతలు చేపడతారన్న ప్రచారానికీ తెరదించుతూ.. తన తల్లి, సోదరుడు పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తానని ఆమె తాజాగా స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement