ఒవైసీపై రాంగోపాల్ వర్మ పోటీ? | ram gopal varma likely to fight against asaduddin owaisi | Sakshi
Sakshi News home page

ఒవైసీపై రాంగోపాల్ వర్మ పోటీ?

Published Wed, Mar 26 2014 11:27 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

ఒవైసీపై రాంగోపాల్ వర్మ పోటీ? - Sakshi

ఒవైసీపై రాంగోపాల్ వర్మ పోటీ?

మజ్లిస్ కోటను బద్దలుకొట్టడం బీజేపీకి సాధ్యమేనా? పాతబస్తీలో పాగా వేయడానికి కమలనాథులు ఓ ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? ఎంఐఎం అధినేత, సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టేందుకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను బరిలోకి దించాలనుకుంటున్నారా? జాతీయ మీడియా ఇదే మాట చెబుతోంది. స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సూచనల మేరకు నేరుగా బీజేపీ అభ్యర్థిగా కాకుండా, శివసేన తరఫున రాంగోపాల్ వర్మను పోటీకి నిలబెట్టి, ఎన్డీయే అభ్యర్థిగా చూపించేందుకు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే రాంగోపాల్ వర్మ ఇటీవల రౌడీ చిత్రం ఆడియో ఆవిష్కరణ సమయంలో మాత్రం కొంత భిన్నంగా కనిపించారు. దండలు వేయించుకున్నారు, మోహన్బాబును స్నేహితుడు అంటూ పొగిడారు కూడా. మోహన్బాబు బుధవారం నాడు గుజరాత్ వెళ్లి నరేంద్రమోడీని కలుస్తున్నారు. బహుశా ఆ సందర్భంలో వాళ్లిద్దరి మధ్య రాంగోపాల్ వర్మ గురించిన చర్చ కూడా రావచ్చనేది విశ్వసనీయ సమాచారం. బీజేపీ తరఫున కాకుండా శివసేన అభ్యర్థిగా వర్మను రంగంలోకి దింపాలన్నది కూడా మోడీ వ్యూహమేనని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు ఒకరిని తమ పార్టీ తరఫున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్న విషయాన్ని శివసేన వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement