పొన్నాల లక్ష్యయ్య
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ద్వారాలు తెరిచే ఉన్నాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య అన్నారు. అయితే ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు. పొత్తులంటూ ఉంటే కనీస ఉమ్మడి ప్రణాళికలు ఉంటాయన్నారు. 30 ఏళ్ల రాజకీయాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలిస్తూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ వ్యతిరేకి అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్ అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణాభివృద్ధికి కీలకమన్న వాస్తవాన్ని కేసీఆర్ గ్రహించాలన్నారు.
గెలుపు, సామాజిక కోణం ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. సీపీఐతో పొత్తులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. సీపీఐతో తుదికసరత్తు జరుగుతోందని పొన్నాల చెప్పారు.