వైఎస్సార్ సీపీలో పలువురు నాయకుల చేరిక | some leaders are going to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో పలువురు నాయకుల చేరిక

Published Sun, Mar 23 2014 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వైఎస్సార్ సీపీలో పలువురు నాయకుల చేరిక - Sakshi

వైఎస్సార్ సీపీలో పలువురు నాయకుల చేరిక

వినుకొండ, న్యూస్‌లైన్
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో నాయకులు పార్టీలో చేరారు.
 
పట్టణ శివారు విఠంరాజుపల్లి సమీపంలోని బాలాజీ ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో శావల్యాపురం మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, వినుకొండ మాజీ ఎంపీపీ చీరపురెడ్డి కోటిరెడ్డి, మాజీ సర్పంచి రొడ్డా వీరాంజనేయరెడ్డి, మాజీ కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ మూలె వెంకటేశ్వరరెడ్డి, వీర్ల దిబ్బయ్యయాదవ్, సాగునీటి సంఘం అధ్యక్షులు బీవీ రామిరెడ్డి, తుమ్మలపల్లి సాయిరాంతోపాటు మరికొందరు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ షర్మిల కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
 
 దివంగత మహానేత డాక్టర్  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముందుకుసాగాలని షర్మిల సూచిం చారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట లోకసభ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేగా డాక్టర్ నన్నపనేని సుధల విజయానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సుధ, డాక్టర్ లతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement