ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చార్టర్డ్ అకౌంటెంట్ల మద్దతు
సాక్షి, హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని చార్టర్డ్ అకౌంటెంట్లు నిర్ణయించారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త రాజధాని నిర్మాణం, సీమాంధ్ర పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు చర్చకొచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రీ ఆడిటింగ్ జరపాలనే ఒక వినూత్నమైన ప్రక్రియకు జగన్ శ్రీకారం చుడుతున్నందున ఈ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్లు నిధుల సక్రమ వినియోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని సమావేశం అభిప్రాయపడింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. పేదల హృదయాల్లో నిలిచిపోయేలా తన తండ్రి వలే తాను కూడా సంక్షేమ పథకాలు చేపట్టాలన్న కృతనిశ్చయంతో జగన్ ఉన్నారంటే ఆయన చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు.
జగన్‌తోనే కొత్త రాజధాని నిర్మాణం సాధ్యం
Published Sun, May 4 2014 2:48 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement