రెచ్చిపోతున్న పచ్చ నేతలు | tdp leaders Dinner parties politics | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న పచ్చ నేతలు

Published Fri, May 2 2014 1:08 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

tdp leaders Dinner parties  politics

 టీడీపీలో విందు రాజకీయాలు
 విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాకేంద్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉలంఘిస్తున్నారు. ఎన్నికల అధికారుల కళ్లుకప్పి విందు భోజనాలు, సొమ్ముల పంపిణీ కార్యక్రమాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో  ఇటు కాంగ్రెస్, అటు టీడీపీల నుంచి వైఎస్‌ఆర్ సీపీలోకి నాయకులు చేరడాన్ని ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో విందు రాజకీయాలతో టీడీపీ ప్రలోభాలకు దిగింది. కుల, ఉద్యోగ, వృత్తికారుల సంఘాల నేతల పరంగా ఓటర్లను విడదీసి వేర్వేరుగా ఆయా నాయకులను, సభ్యులను ఆహ్వానిస్తూ గత కొద్దిరోజులుగా పట్టణంలోని వివిధ ప్రైవేటు హోటళ్లలో స్థానిక టీడీపీ అభ్యర్థి మీసాల గీత విందుభోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించి కేసు పెట్టిన అధికారులకు రాజకీయ రంగు పులుముతున్నారు. పుట్టిన రోజు పేరుతో సంబంధిత వర్గాల నేతలను లోపాయికారంగా ఆహ్వాని స్తూ చేతుల్లో సొమ్ములను పెడుతున్నారు.  స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, కోట జంక్షన్ ప్రాంతాల్లోని ప్రైవేటు హాటళ్లలో టీడీపీ అభ్యర్థి మద్దతుదారులు ఈ వ్యవహారాలను గుట్టుగా నడుపుతున్నారు. ఓ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఉపాధ్యాయులను కూడగట్టి బుధవారం రాత్రి స్థానిక ప్రైవేటు హోటళ్లలో విందుభోజనం ఏర్పాటు చేశారు. మీడియాకు తెలిసిపోయిందని ఉప్పందడంతో హొటల్ వెనుక మార్గం నుంచి ఉడాయించారు.
 
 బలవంత చేర్పులకు...   సొమ్ముల పంపిణీ
 గురువారం స్థానిక తోటపాలెంకు చెందిన తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థి బంధువు, కాంగ్రెస్ పార్టీ మాజీ  కౌన్సిలర్ టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా (ఇండిపెండెంట్) మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మున్సిపల్ ఎన్నికల సమయంలోనే
 
 బాబు సభకోసం పాఠశాల గోడకూల్చివేత !
 చీపురుపల్లి, న్యూస్‌లైన్: తెలుగు తమ్ముళ్లు నిబంధనలు తుంగలోకి తొక్కారు...  పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సభ కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలు తమకు అవసరం లేదన్న చందంగా చీపురుపల్లిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చీపురుపల్లికి రానున్నారు.
 
 ఆయన బహిరంగ సభను పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.  సభా ప్రాంగణంలోకి వాహనాలు రాకపోకల కోసం ఏకంగా పాఠశాల ప్రహరీని కూల్చేశారు. జేసీబీతో  పాఠశాల ప్రహరీని తొలగించడం చూసిన వారు అవాక్కయ్యారు. అసలు ఎన్నికల ప్రచారాన్ని ప్రభుత్వ స్థలాలు, మతపరమైన ప్రదేశాల్లో నిర్వహించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు బహిరంగ సభకు ఎన్నికల అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే బహిరంగ సభకు అనుమతి ఇస్తే తెలుగుదేశం నేతలు ఏకంగా ప్రహరీని కూల్చి వేశారు.  కనీసం పాఠశాల ప్రధానోపాధ్యాయుని అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా టీడీపీ నేతలకు రాలేదు. గోడ కూల్చివేతపై  స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 గోడ కూల్చివేసిన విషయం తెలియదు  
 పాఠశాల ప్రహరీ కూల్చివేసిన తనకు తెలియదని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.లలితకుమారి ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో తాను చీపురుపల్లిలో లేనని, అయినప్పటికీ గోడ ఎలా కూల్చి వేస్తారని ఆమె అన్నారు. ఎవరైనా అనుమతి కోరినప్పటికీ కూడా తాము గోడ కూల్చివేతకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
 
 సభకు అనుమతులు ఉన్నాయి...

చంద్రబాబునాయుడు సభకు అనుమతులు ఇచ్చామని అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెచ్.వి.జయరామ్ అన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశానికి అనుమతి కోరుతూ తనకు లిఖిత పూర్వకంగా కోరారని, దానిని  కలెక్టర్ వారికి పంపించగా అక్కడి నుంచి అనుమతి వచ్చిందన్నారు. అయితే పాఠశాల ప్రహరీ కూల్చివేతకు అనుమతులకు సంబంధం ఉండదని చెప్పారు. ప్రహరీ కూల్చివేసిన అంశం పాఠశాల యాజ మాన్యం చూసుకోవాల్సి ఉంటుందన్నారు.
 
 పుట్టిన రోజు పేరుతో..
 విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌ైలైన్: అధికార దాహంతో టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. తొమ్మిదేళ్ల పాటు ప్రతి పక్షంలో ఉన్న వారు ఈసారి ఎలాగైనా పదవు లు దక్కించుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నా రు. ఇందుకోసం ఎన్నికల నియమావళిని తుంగలోకి తొక్కుతున్నారు. ఎన్నికల్లో భాగంగా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎన్నడూ లేని విధంగా కొత్త కార్యక్రమాలను సృష్టిస్తున్నా రు. ఒక్క మాటలో చెప్పలంటే ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందు కు పడరాని పాట్లు పడుతున్నా రు. ఇందుకు గురువారం ఉదయం టీడీపీ ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతి రాజు బంగ్లాలో జరిగిన విందు రాజకీయాన్నే తార్కాణంగా చెప్పవచ్చు. అశోక్ గురువా రం ఉదయం తన కుమార్తె విద్యావతిదేవి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
 
 ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ మాన్సాస్ ట్రస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న వేయి మంది ఉద్యోగులకు ముందుగానే ఆహ్వానాలు పంపించారు. వారు కూడా ఎన్నడూ లేనివిధంగా ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిలవడంతో ఆశ్చర్యానికి లోనైప్పటికీ ఉదయం 8 గంటలకు బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ ముందుగా పలువురు టీడీపీ నాయకులు ఇచ్చిన పుష్పగుచ్ఛాలను విద్యావతి దేవికి ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం అక్కడికి హాజరైన వారికి అల్పాహార విందు ఇచ్చారు. ఇదంతా చూస్తున్న ఉద్యోగులు మన పట్ల ఇప్పుడికప్పుడు ఎందుకంత ప్రేమ పుట్టిందో అంటూ గుసగుసలాడుకున్నారు. చివరిలో అశోక్ నేరు గా చెప్పకున్నా ఆయన అనుచరులు మాత్రం పార్టీకి మద్దతు తెలపాలని, ఈ ఎన్నికల్లో అశోక్ విజయంలో మీ వంతు పాత్ర పోషించాలంటూ చెప్పారు. వాస్తవానికి రాజకీయ విందులు ఎన్నికల సమయంలో నియమావళికి విరుద్ధమైనప్పటికీ పుట్టిన రోజు పేరుతో టీడీపీ నాయకులు ఇలా పబ్బంగడుపుకొనే పనిలో పడ్డారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement