విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకులు తెలివిమీరిపోతున్నారు. ఎన్నికల నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఇదీ.. అదీ అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన అన్ని వాహనాలకూ సంబంధి త పత్రాలతో పాటు ఎన్నికల అధికారులు జారీ చేసిన అనుమతులుండాలి. కానీ టీడీపీ వారు.. గడువు తీరిన వాహనాలను యథావిధిగా వినియోగిస్తున్నారు. ఇదే తరహాలో శని వారం దాసన్నపేట, మారమ్మగుడి, జమ్మునారాయణపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ.. అధికారులకు అడ్డంగా దొరికిపోయూరు. ఏపీ31 ఏఈ 7475నంబరుతో ఉన్న మహీంద్రా వాహనాన్ని పట్టుకున్న అధికారులు.. పర్మిట్ అడిగితే ఈ నెల 22తో గడువు ముగిసిన పత్రాన్ని అధికారు ల చేతిలో డ్రైవర్ పెట్టాడు.
దీంతో పరిశీలన చేసిన ఫ్లలీంగ్ స్క్వాడ్ అధికారి కె.జగదీశ్వరరావు ఇది పాత తేదీతో ఉందని తేల్చారు. అంతేకాదు.. ఈ వాహనానికి ఉన్న నంబరుకు అనుమతి పత్రంలో ఉన్న నంబరుకు తేడా ఉంది. అనుమతి పత్రంలో 4761 నంబర్ ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో వెంటనే డ్రైవర్ వర్రి అప్పలనాయుడును అదుపులోకి తీసుకుని వాహనాన్ని ఎన్నికల కోడ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణకు అప్పగించారు. వెంటనే ఆయన రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి. రామారావు దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేశారని ఫ్లలీంగ్ స్క్వాడ్ తెలిపింది. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ని పలు నియోజకవర్గాల్లో ఇటువంటి వాహనాలతోనే టీడీ పీ ప్రచారాలు నిర్వహిస్తోందన్నది ఈ సంఘటనతో తేటతెల్లమైంది. ఇప్పటికే పలు కేసులు నమోదవుతున్నా టీడీపీ వర్గా లు ఏకంగా ఎన్నికల కమిషన్‌నే బోల్తా కొట్టించడం విశేషం.
ఈసీకి టీడీపీ టోకరా!
Published Sun, May 4 2014 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement