సాలూరులో వైఎస్సార్ సీపీ దూకుడు
సాలూరు, న్యూస్‌లైన్:సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర ఎన్నికల ప్రచారంలో మంచి దూకుడు కనబరుస్తున్నారు. రాజన్నదొర ఏ పల్లె, వార్డుకు వెళ్లినా వైఎస్సార్ సీపీలో చేరికలతో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. దీంతో తమ గెలుపు సునాయాశమని, మెజార్టీపైనే దృష్టిసారించాలన్న రాజన్నదొర మాటలు వట్టివికావని, వాస్తవాలని కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. ము న్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని సా లూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మం డలాల్లో కొద్దిరోజుల కిందట జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామన్న ధీమాను ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నా రు. రాజన్నదొరపై అవినీతి ఆరోపణలు లేక పోవడం,
నియోజకవర్గంలో పార్టీకి ఉన్న ప్రజా దరణతో పాటు ఆయన గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పార్టీలోకి భారీగా చేరికలు వస్తుండ డంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేస్తున్నా యి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ మాత్రం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో పడ్డారు. నామినేషన్ వేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన ప్రచారాన్ని నామమాత్రంగానే చేస్తున్నారు. హై కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న తర్వాత పార్టీ వ్యవహారాలకు ఆయన దూరం గా ఉన్నారు. దీంతో ఆయనకు నాయ కు లు, కార్యకర్తలతో పెద్దగా సంబంధాలు లేవు. అయితే మళ్లీ ఆయనకే టిక్కెట్ రావడం తో ఎన్ని కల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
భంజ్‌దేవ్‌ను అభ్యర్థిగా ప్రకటించగానే రాజన్నదొర గెలుపు ఖాయం
టీడీపీ అభ్యర్థిగా ఆర్‌పీ భంజ్‌దేవ్ పేరును ప్రకటించడంతోనే తమ పార్టీ అభ్యర్థి రాజన్నదొర గెలుపు నిర్ధారణ అయిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హైకోర్టు భంజ్‌దేవ్‌ను గిరి జనుడు కాదని 2006లో నిర్ధారించిందని, దీంతో ఆయన ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వా త పదవిని కోల్పోవలసి వచ్చిందని, నేడు ఏదో లా గిరిజనుడని కులధ్రువీకరణ పత్రం పొంది నంత మాత్రాన నియోజకవర్గ ప్రజలు ఆయ న్ను నమ్మేపరిస్థితి లేదంటున్నారు. సమర్థవంతమైన పాలకునిగా నిరూపించుకుని, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ సంక్షేమ పథకాలను అమలుచేసి, అందరి మన్ననలు అందుకున్న రాజన్నదొర పక్షానే ప్రజలున్నారని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఫ్యాన్‌గాలి జోరుగా వీస్తుండడంతో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే రాజ న్నదొర ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా మహిళలు హారతులు పడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆండ్ర బాబా ఒంటరివాడిగానే కనిపిస్తున్నారు. ఆటోల ప్రచారం తప్ప మరెలాంటి సందడి ఆ పార్టీలో కనిపించ డం లేదు.
అడకత్తెరలో భంజ్‌దేవ్ భవిత
ఎస్టీ కుల ధ్రువీకరణపత్రం పొంది మరోసారి ఎన్నికల బరిలో భంజ్‌దేవ్ దిగడంతో ఆయన రాజకీయ భవితవ్యంతోపాటు వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న వాదన వినవస్తోంది. రాజన్నదొర ఇప్పటికే భంజ్‌దేవ్ పై క్రిమినల్, ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైకోర్టుకు వెళ్తానని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. గిరి జనుడిగా కులధ్రువీకరణ పత్రం పొంది నియోజకవర్గ ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని, గతంలో ఎమ్మెల్యేగా ఆయన పొందిన లబ్ధిని కక్కిస్తామని పేర్కొనడంతో నియోజకవర్గంలో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. పదవిమాట దేవుడెరుగు, రాజన్నదొర రూపంలో పొంచి ఉన్న ముప్పు నుంచి తప్పించుకుంటే చాలని సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు అభిప్రాయపడుతుండం గమనార్హం.