కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రానున్న లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జిల్లాకు జనరల్ అబ్జర్వర్లను, వ్యయ పరిశీలకులను నియమించింది. వీరి వివరాలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
కడప పార్లమెంటుకు సంబంధించి జనరల్ అబ్జర్వర్‌గా ఢిల్లీకి చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వందన యాదవ్‌ను నియమించారు. ఆయన బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజక వర్గాలను పర్యవేక్షిస్తారు. రాజంపేట పార్లమెంటు జనరల్ అబ్జర్వర్‌గా ఢిల్లీకి చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రశాంతకుమార్ మహాపత్రను నియమించారు. ఆయన రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులుగా ఉంటారు. ఈనెల 19వ తేది వీరు జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసేవరకు వీరు జిల్లాలో ఉంటారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలకు జమ్ము అండ్‌కాశ్మీర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి షఫీక్ అహ్మద్‌రైనాను నియమించారు. అలాగే బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్‌గా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి హరేంద్రవీర్‌సింగ్‌ను నియమించారు. ఇక రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దిగ్విజయ్‌సింగ్‌ను నియమించారు.
వ్యయ పరిశీలకులు..
కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వ్యయ పరిశీలకులుగా మధ్యప్రదేశ్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి బీఆర్ లతోరియను నియమించారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకునిగా కేరళకు చెందిన 2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి ఎం.జయరామ్‌ను నియమించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి బీఆర్ లతోరియ కడప, పులివెందుల, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులుగా వ్యవహారిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి సిన్హా అమర్‌కుమార్ బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల వ్యయ పరిశీలకులుగా ఉంటారు. కేరళ ఐఆర్‌ఎస్ అధికారి జయరామ్ రాజంపేట,రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల అభ్యర్థుల వ్యయాలను పరిశీలిస్తారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
Published Wed, Apr 2 2014 3:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement