ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో.. ముందుగానే అమెరికా అభినందనలు తెలిపింది. ఎన్నికలు విజయవంతంగా ముగించారని, దేశంలో కొత్త ప్రభుత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామని సందేశం పంపింది. ''భారతదేశ ప్రజలు కొత్తగా ఎన్నుకున్న నాయకులతో కలిసి పనిచేయడానికి మేం ఎదురు చూస్తున్నాం. కీలకమైన భాగస్వామ్యంతో అద్భుతమైన జెండా ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నాం'' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకీ విలేకరులతో అన్నారు.
అత్యంత స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగడం, వాటిలో అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో భారతదేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. కోట్లాది మంది ఓటర్లు ఆరు వారాల పాటు చాలా ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని, అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ఓట్లు వేశారని, ఇది అద్భుతమని అమెరికా ప్రతినిధి అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించబోతోందని ఆమె జోస్యం చెప్పారు. అయితే బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీయే ప్రధాని కాబోతున్నారంటూ ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. భారత్ లేదా వేరే ఏ దేశంలోనైనా అంతర్గతంగా జరిగే విషయాల్లో తాము వేలు పెట్టబోమని వ్యాఖ్యానించారు.
కంగ్రాట్స్... ఇండియా!!
Published Fri, May 16 2014 6:36 AM | Last Updated on Fri, Aug 24 2018 6:25 PM
Advertisement