![చిరంజీవిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోంది - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71393964598_625x300_22.jpg.webp?itok=Gr2IVLpE)
చిరంజీవిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోంది
నెల్లూరు: రాష్ట్ర విభజన అంశంలో నోరు మెదపని సోనియా గాంధీ, రాహుల్కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకుంటోందన్నారు. రాష్ట్రం లక్ష కోట్ల అప్పుల్లో ఉందని వెంకయ్య పేర్కొన్నారు. కేంద్రం సాయం లేనిదే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.