'రాహుల్ గాంధీకి మతిభ్రమించింది' | Rahul gandhi loses Balance of mind, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

'రాహుల్ గాంధీకి మతిభ్రమించింది'

Published Mon, Mar 17 2014 10:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'రాహుల్ గాంధీకి మతిభ్రమించింది' - Sakshi

'రాహుల్ గాంధీకి మతిభ్రమించింది'

నల్గొండ : నరేంద్ర మోడీపై... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. గోధ్రా తదనంతర అల్లర్ల విషయంలో  మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం రాహుల్కు తెలియదా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీకి మతి భ్రమించిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులపై రాహుల్కు నమ్మకం లేదా అని సూటిగా ప్రశ్నలు సంధించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు రెండంకెల సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్పై నమ్మకం లేకే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదన్నారు. రాష్ట్రంలో పొత్తుల విషయం త్వరలోనే తేలుస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. వారంలోగా పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement