కృష్ణయ్య సీఎం అని చెప్పలేదు: ఎర్రబెల్లి | we did not announce krishnaiah as cm candidate, says errabilli dayakar rao | Sakshi
Sakshi News home page

కృష్ణయ్య సీఎం అని చెప్పలేదు: ఎర్రబెల్లి

Published Wed, Mar 26 2014 12:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

కృష్ణయ్య సీఎం అని చెప్పలేదు: ఎర్రబెల్లి - Sakshi

కృష్ణయ్య సీఎం అని చెప్పలేదు: ఎర్రబెల్లి

దళిత సీఎంపై మాట మార్చిన కేసీఆర్ను అందరూ నిలదీయాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీడీపీ సీమాంధ్ర నేతలు వ్యతిరేకించినా చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు తప్ప విభజన లేఖను మాత్రం ఆయన ఏనాడూ వెనక్కి తీసుకోలేదని చెప్పారు. విభజనకు తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు సహకరించారని, కేసీఆర్‌ మాత్రం ఓటింగ్‌లో పాల్గొన్నారో లేదో తెలియదని అన్నారు.

తెలంగాణ సాధన కోసం తమ వంతు కార్యక్రమాలు తాము చేశామని, అయినా కూడా టీడీపీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రవేసి టీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. తాము బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామన్నామే తప్ప.. ఆర్.కృష్ణయ్యనే అని చెప్పలేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఒకవేళ శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటాని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement