వైఎస్సార్ సీపీ టీమ్ రెడీ
వైఎస్సార్ సీపీ టీమ్ రెడీ
Published Tue, Apr 15 2014 1:45 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
టిక్కెట్ల కేటాయింపులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చారు. గెలుపు గుర్రాలుగా భావించిన వారందరికీ టిక్కెట్లు కేటాయించారు. ఏ ఒక్క వర్గాన్ని నిరుత్సాహ పరచకుండా జిల్లా అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకుల్లో సమరోత్సాహం పెల్లు బుకుతోంది. అందర్నీ ఆకట్టుకున్న మేనిఫెస్టోతో విజయమే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని నియోజకవర్గాలన్నింటికీ ఒకేసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
-ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కొప్పల వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి, వెలమ సామాజికవర్గం నుంచి ఇద్దరికి, తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి, క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒకరికి టిక్కెట్లు లభించాయి.
-ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలకు టిక్కెట్లు వరించాయి. యువతకు పెద్దపీట వేశారు. ఆశించిన విధంగానే అభ్యర్థులను ఎంపిక చేశారని అన్ని వర్గాలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, యువతతో మమేకమై, అందర్నీ కలుపుకొని, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా ముందుకెళ్తున్న బేబీనాయనకు ఊహించినట్టే విజయనగరం ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైంది. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. రాజకీయాల్లో చురుకైన నేతగా పేరుంది. మన్యప్రాంతమైనా, క్లిష్ట పరిస్థితులున్నా పార్టీ కోసం పరితపిస్తూ, గిరిజనులతో మమేకవుతూ, ఏజెన్సీలో ఫ్యాన్ గాలి వీచేందుకు ప్రయత్నించిన కొత్తపల్లి గీతను అరకు అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్డీవోగా సేవలందించిన ఆమెకు పాలనా వ్యవ హారాలపై మంచి పట్టు ఉంది. ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలోనూ ఇదే తరహాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించారు.
ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్న సుజయకృష్ణ రంగారావును బొబ్బిలి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఒక్క విజయనగరం జిల్లానే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పార్టీ పటిష్టతకు కృషి చేయడమే కాకుండా మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేసిన సుజయకృష్ణకు తగిన ప్రాధాన్యం కల్పించారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగామూడోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. యువతకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ సురేష్‌బాబును నెల్లిమర్ల అభ్యర్థిగా ప్రకటించారు. ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా, అనేక సార్లు మంత్రి పద వులు అలంకరించిన సాంబశివరాజు కుమారుడిగా సురేష్‌బాబుకు నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తోంది.
తొలి నుంచి పని చేస్తున్న కడుబ ండి శ్రీనివాసరావును గజపతినగరం అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో అన్నింటా విజయం సాధించేలా కృషి చేసిన కడుబండిపై పార్టీ పూర్తి విశ్వాసం ఉంచింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజాదరణ చూర గొన్న పీడిక రాజన్న దొరను సాలూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారు. తొలి నుంచి పనిచేస్తూ ఏజెన్సీలో పార్టీ పటిష్టతకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజుకు పార్టీ తగిన గుర్తింపు ఇచ్చింది. మహిళలకు మరో టిక్కెట్ కేటాయిస్తూ ఆయన కోడలు పాముల పుష్ప శ్రీవాణి ని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఏజెన్సీ ముఖద్వారమైన పార్వతీపురం అభ్యర్థిగా జమ్మాన ప్రసన్నకుమార్‌ను ఎంపిక చేశారు. విజయనగరంలో ప్రజాదరణగల నాయకుడిగా, అభివృద్ధే ధ్యేయంగా పని చేసే నేతగా గుర్తింపు ఉన్న కోలగట్ల వీరభద్రస్వామిపై అధిష్టానం నమ్మకం ఉంచింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును ఓడించిన ఏకైక నేతగా ఘనత వహించారు. ఎమ్మె ల్సీ పదవీ కాలం ఉన్నా.... రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ప్రజల కోరిక మేరకు వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్రస్వామిని విజయ నగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, ప్రత్యర్థులకు పార్టీ సవాల్ విసిరింది. జెడ్పీ మాజీ చైర్మన్‌గా, కష్టపడి పని చేసే నేతగా గుర్తింపు ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌ను ఊహించినట్టుగానే చీపురుపల్లి అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన రొంగలి జగన్నాథంను ప్రొత్సహిస్తూ శృంగవరపుకోట టిక్కెట్ కేటాయించారు. మొత్తానికి సమపాళ్లతో ఉన్న అభ్యర్థుల జాబితాపై జిల్లాలో హర్షం వ్యక్తమవు తోంది.
పార్లమెంట్ అభ్యర్థులు
విజయనగరం : బేబీనాయన,
అరకు : కొత్తపల్లి గీత
అసెంబ్లీ అభ్యర్థులు
బొబ్బిలి - సుజయకృష్ణరంగారావు
విజయనగరం- కోలగట్ల,
సాలూరు- రాజన్నదొర
గజపతినగరం- కడుబండి,
చీపురుపల్లి- బెల్లాన
నెల్లిమర్ల - డాక్టర్ సురేష్‌బాబు,
పార్వతీపురం- {పసన్నకుమార్
కురుపాం- పాముల పుష్ప శ్రీవాణి,
ఎస్. కోట- రొంగలి జగన్నాథం
విజయనగరం ఎంపీ అభ్యర్థి
పేరు:రావు వెంకటశ్వేతా కుమారకృష్ణరంగారావు(బేబీనాయన)
తండ్రి: లేటుగోపాలకృష్ణ రంగారావు
తల్లి : రాణి మంగతాయారు
భార్య: రావు శిల్ప
కుమార్తె: మేధా జాహ్నవి
పుట్టిన తేదీ: 24 జూన్ 1980
పుట్టిన ప్రదేశం : చెన్నై
విద్యార్హత: బీఏ
ప్రధానాధారం: వ్యవసాయం
రాజకీయ నేపథ్యం:
తాత: ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు ఉమ్మడి మద్రాస్ ప్రీవియస్ ముఖ్య మంత్రిగా(1931-36) పనిచేశారు. 1967-72లో బొబ్బిలి ఎమ్‌ఎల్‌ఏగా ఉన్నారు.
తండ్రి: ఆర్‌వీజీకే రంగారావు 1962-67 చీపురుపల్లి నియోజకవర్గం ఎంపీగా చేశారు. 1974-1980 వరకూ ఎమ్మెల్సీగా చేశారు.
సోదరుడు: ఆర్వీసుజయ్‌కృష్ణ రంగారావు 2004, 2009ల్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాజకీయ అనుభవం: 1999లో పరోక్ష రాజకీయాలు చేసి 2000 సంవత్సరంలో బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. 28వ వార్డు నుంచి ఏక గ్రీవంగా ఎన్నికై మున్సిపల్ చైర్మన్‌గా చేశారు. 2004, 2009 ఎన్నికల్లో సోదరుడు సుజయ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి విజ యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరుకు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు.
అరకు ఎంపీ అభ్యర్థి
పేరు: కొత్తపల్లి గీత
విద్యార్హతలు: ఎంఏ., బీఎడ్
వయసు: 43
కుటుంబ సభ్యులు: భర్త పి.రామకోటేశ్వరరావు, కుమారుడు అభినయ్, కుమార్తె అన్విత
రాజకీయ నేపథ్యం: గ్రూప్ 1 అధికారిగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేశాక.. గత ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
నిర్వహించిన పదవులు: చెన్నైలోని విశ్వేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గీత సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Advertisement
Advertisement