దళిత క్రైస్తవులకు ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుని పిలుపు
సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులందరూ వైఎస్సార్‌సీపీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు పెరికే వరప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దమైన జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టి ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని సూచిం చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని 2009 ఆగస్టు 25న అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందీ ఆయనేనని గుర్తుచేశారు. జెరూసలెం వెళ్లే యాత్రికులకోసం రూ.2 కోట్ల సబ్సిడీని ప్రకటించిన ఘనత వైఎస్‌దేనన్నారు. రాష్ట్రంలోని దళితులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లల్లో సమ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత కూడా వైఎస్‌దేనని పేర్కొన్నారు. ప్రస్తుత కీలక తరుణంలో వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించడం ఎంతో అవసరమన్నారు.
వైఎస్సార్‌సీపీనే గెలిపించాలి: పెరికే వరప్రసాదరావు
Published Wed, Apr 23 2014 4:13 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement