వైఎస్ వెలుగులు | ysr ruling development | Sakshi

వైఎస్ వెలుగులు

Published Sat, Mar 29 2014 3:26 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పట్టణాల్లోని మురికివాడలకు కోట్ల రూపాయలు వెచ్చించారు.

సాక్షి, గుంటూరు: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో  పట్టణాల్లోని మురికివాడలకు కోట్ల రూపాయలు వెచ్చించారు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. కొన్ని మున్సిపాలిటీలకు నూతన భవనాలు, పట్టణాల్లో సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లను కోట్ల నిధులతో నిర్మించి పట్టణాలకు కొత్త కాంతులు తెచ్చిపెట్టారు.
 
 అంతేకాక అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకం ద్వారా మురుగునీరు రోడ్లపై కనిపించకుండా మున్సిపాలిటీలను క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసిన ఘనత ఆయనకే దక్కింది.అయితే ఆయన మరణంతో పట్టణాభివృద్ధి నిలిచిపోయింది. ఇప్పటి వరకు పట్టణ ప్రజల బాధలు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడని, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెబుతామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదీ వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి...
మంగళగిరిలో రూ. 60 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.వైఎస్ మరణంతో ఇవన్నీ ఆగిపోయాయి.  తొలి విడతలో 504 మంది నిరుపేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చారు.
 
నూతనంగా ఏర్పడిన తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాలిటీగా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. 40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆయన మరణంతో అది కాస్తా నిలిచిపోయింది.

పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు.
 
బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో  అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్ అకాల మరణంతో ఆ పథకాన్ని పట్టించుకున్న దిక్కే లేకుండా పోయింది. వైఎస్సార్ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు.
 
సత్తెనపల్లిలో రూ. 14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువు తవ్వించారు. రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌ెహ డ్ ట్యాంకులు పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం చేశారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్లు అందించారు.
 
చిలకలూరిపేటలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్లు మంజూరు చేశారు. నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, రూ. 8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
 
నరసరావుపేటలో రూ.44 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పథకానికి శంకుస్థాపన చేశారు. రూ. 22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, రాజీవ్ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు.
 
బాపట్లలో రూ.49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. రూ. 2 కోట్ల వ్యయంతో గృహ సముదాయాలు నిర్మించారు.
 
తెనాలిలో రూ. 100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణంతో ఆ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది.
 
మహానేత వైఎస్సార్ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాలిటీగా మార్చి రూ. 30 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేశారు. రూ. 15 కోట్లతో మంచినీటి పథకాన్ని నిర్మించారు.
 
రేపల్లెలో రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణం చేశారు. వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీచేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేశారు.
 
పొన్నూరు మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి  కోటి రూపాయలు మంజూరు చేశారు. మరో కోటితో హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement