Clean and Green
-
సీఎం ఆదేశాలు.. ప్రైవేట్‌కు ధీటుగా వాటి రూపురేఖలు మారనున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉన్న వీటిని ప్రైవేటు పార్కులకు దీటుగా హరిత పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఏపీఐఐసీ చేపట్టింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత పారిశ్రామిక పార్కుల్లో వ్యర్థాలను తొలగించి పచ్చదనాన్ని పెంచే విధంగా ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ డ్రైవ్ పేరుతో 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 20న మొదలైన ఈ కార్యక్రమం జులై 5 వరకు జరుగుతుందని.. తొలిదశలో వ్యర్థాల తొలగింపు, వరద కాలువల అభివృద్ధి, అంతర్గత రహదారులకు మరమ్మతులపై దృష్టిసారించామని.. రానున్న రోజుల్లో మురుగు నీరు, వ్యర్థాల శుద్ధి, నీటి సదుపాయం వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించనున్నట్లు ఏపీఐఐసీ వీసీ–ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలోని 168 ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా)లను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలతో సమన్వయం రాష్ట్రంలోని 168 ఐలాలకు ఏటా రూ.120 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా వీటి నిర్వహణపై గత ప్రభుత్వాలు దృష్టిసారించలేదు. ఐలాలకు వచ్చే ఆదాయంలో 35 శాతం స్థానిక పురపాలక, గ్రామ పంచాయతీలకు వెళ్తుంది. పారిశ్రామికవాడల్లో వ్యర్థాల తొలగింపునకు సంబంధించి స్థానిక సంస్థలు, ఐలాల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థలతో కలిసి వ్యర్థాలను తొలగించి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ డ్రైవ్ ప్రారంభించిన మూడ్రోజుల్లోనే 100 కి.మీ పైగా రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించింది. అలాగే.. 14,000 మీటర్ల అంతర్గత రహదారులకు మరమ్మతులు, 33,543 మీటర్ల మేర వరద కాలువల్లో చెత్తను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని జులై 5కల్లా రాష్ట్ర పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారతాయన్న ఆశాభావాన్ని సుబ్రమణ్యం వ్యక్తంచేశారు. ఐపీఆర్‌ఎస్‌లో చోటే లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణలో ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) కీలకపాత్ర పోషిస్తుంది. ఐపీఆర్‌ఎస్ ర్యాంకింగ్‌లో ప్రభుత్వ రంగ పారిశ్రామిక పార్కులు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు పెంచడం ద్వారా ఐపీఆర్‌ఎస్ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఏపీలోని ఏపీఐఐసీ పార్కుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 50వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మౌలిక వసతులు లేకపోవడంతో చాలా చోట్ల యూనిట్లు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఇప్పుడు మౌలిక వసతులు కల్పించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చదవండి: మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ -
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో కేంద్రం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఆరంభించనుంది. దేశాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రయత్నం ముమ్మరంచేసింది. ఆ ప్లాస్టిక్ వాడకాన్ని ఈ నెలాఖరుకల్లా దశల వారీగా నిర్మూలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ, స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు అడ్వైజరీని పంపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాల మేరకు 2,591 నగర మున్సిపాలిటీలు ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేశాయి. మరో 2,100 నగర మున్సిపాలిటీల్లోనూ ఈ నెల 30లోగా నిషేధం క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్న ‘హాట్ స్పాట్’లను గుర్తించి, వాటిని తొలగించాల్సిన బాధ్యత పట్టణప్రాంత స్థానిక సంస్థలదే అని కేంద్రం స్పష్టంచేసింది. ఆ ప్లాస్టిక్ వినియోగం నిషేధాలను అమలు చేయడం కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ల సాయం తీసుకోవాలంది. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ల ఏర్పాటు, ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనులపై భారీ జరిమానా విధించాలని కేంద్రం సూచించింది. దేశంలో 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం/ వాడి పడేసిన ప్లాస్టిక్‌తో తయారైన క్యారీ బ్యాగ్‌ల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంది. -
కర్నూలు జిల్లా: ఇంటింటికి వెళ్లి క్లీన్ అండ్ గ్రీన్ పై అవగాహన
-
‘పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో స్వచ్చతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న స్వచ్చ సంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఆయా గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ సీఇఓ, డీపీఓ, డ్వామా పీడీ, ఎంపీడీఓ, పంచాయతీ ఇఓ, గ్రామ సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లి సీపీఆర్ కార్యాలయం నుంచి పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్చాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూలై 8 స్వర్గీయ వైఎస్సార్ జయంతి నాడు 'జగనన్న స్వచ్ఛసంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు. కోవిడ్ మన గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చూసే బాధ్యత సర్పంచులదేనని, వాళ్ల సారథ్యంలో స్వచ్ఛమైన పల్లెలను సృష్టించుకోవాలని తెలిపారు. ప్రజలు సర్పంచులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే సమయం ఇదేనంటూ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ( చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు ) -
‘మన ఊరు–మన పరిశుభ్రత’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) – జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న ప్రారంభించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో గ్రామాలు, పట్టణాలలో పూర్తి పారిశుధ్యం కోసం మునిసిపల్ విభాగం పంచాయతీరాజ్ విభాగంతో కలిసి పనిచేయాలని సూచించారు. దీన్ని మనసా వాచా కర్మణా చేపట్టాలని, ఏ కార్యక్రమం అయినా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో ప్రతీ గ్రామంలోనూ అధికారుల పనితీరు కనిపించాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో జలజీవన్ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జగనన్న పల్లె వెలుగు కింద వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘వైఎస్సార్ జలకళ’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు తవ్వాలని నిర్ణయించామని, చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంపు సెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మే 1 నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో శానిటేషన్‌పై కార్యాచరణ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సీఎం గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష వివరాలు ఇవీ.. పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు... ప్రతి చోటా మనం ఎఫిషియెంట్‌గా ఉండాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ చాలా ముఖ్యం. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదు. ముఖ్యంగా మురికి వాడల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంది. సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని డిస్పోస్ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మురుగునీటిని ఎక్కడపడితే అక్కడికి తరలించొద్దు. ట్రీట్మెంట్ ప్లాంట్‌కు పంపాలి. ఘన వ్యర్థ్యాల (సాలిడ్ వేస్ట్)ను కాల్చి వదిలేయకుండా ఏం చేయాలన్న దానిపై ఎస్వోపీ రూపొందించండి. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ మొదలు యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్ అన్నీ అదనంగా ఇవ్వండి. అవసరం మేరకు అన్నీ సమకూర్చండి. పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కడా ఏ లోపం లేకుండా అన్నీ సమకూర్చాలి. సేవల్లో లోపం ఉండకూడదు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అన్న నినాదంతో పనులు, కార్యక్రమాలు చేపట్టాలి. చెత్త సేకరణకు వినియోగించే ఈ – వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్) నిర్వహణ భారం కాకుండా చూడాలి. గ్రామాల్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, వీధి దీపాలు.. ఈ మూడింటిపై ఎక్కువ వ్యయం చేయాలి. వాటికే అత్యధిక ప్రాధాన్యం. బోరు తవ్విన నెలలోపు కరెంట్, పంపుసెట్.. వైఎస్సార్ జలకళ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు తవ్వాలని నిర్ణయించాం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంపుసెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిద్వారా 5 లక్షల ఎకరాలను సాగు నీరు అందుతుందని అంచనా. బోరు తవ్వాలని ఏ రైతు దరఖాస్తు చేసినా ఎప్పుడు బోరు వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. అందుకోసం ఎస్వోపీ ఖరారు చేయాలి. ఇచ్చిన తేదీ రోజు కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు.. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి పంపుసెట్ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంపుసెట్లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. బోర్ల లోతుపై నిబంధనలు సడలించి జియాలజిస్టులు పరీక్ష చేసి ఎంత లోతు వరకు బోరు తవ్వవచ్చు అంటే అంతవరకు వెళ్లండి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. అది మీ టార్గెట్. జగనన్న కాలనీల్లో జల్‌జీవన్ మిషన్‌కు ప్రాధాన్యం జగనన్న కాలనీల్లో జల్‌జీవన్ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జలజీవన్ మిషన్ కింద గ్రామీణ తాగునీటి సరఫరా చేయాలి. జగనన్న కాలనీలు కూడా ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమంలో వాటిని కూడా చేర్చాలి. నీటి వనరులు, స్టోరేజీ, సరఫరా ఈ మూడింటిపై దృష్టి పెట్టి పనులు చేయాలి. వేసవిలో నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎప్పుడు, ఏ ట్యాంకులు శుభ్రం చేయాలో ఒక ప్రొటోకాల్ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేయాలి. ఏలూరు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు).. ఎల్ఈడీ వీధి దీపాల వాడకం వల్ల ఏటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల లైట్లు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు.. ఏపీ రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ) కింద 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది. సమీక్షలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పల్లెలకు పట్టణ సొబగులు
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సం స్థలో విలీనమైన 8 గ్రామపంచాయతీలు పట్టణీకరణను సంతరించుకుంటున్నాయి.నగరంలో విలీ నం కావడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. విలీన గ్రామాలన్నింటినీ సమీప డివిజన్లలో కలపడంతోపాటు బోర్డులు ఏర్పాటు చేయడంతో గ్రా మాలకు నగరపాలక హంగులు కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో ప్రజ లకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు పనులు చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కనీస సౌకర్యాలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలను తక్కువ సమయంలోనే డివిజన్లకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రతీ విభాగానికి ప్రత్యేక అధికారులను కేటాయించి పనులు చేపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మాదిరిగా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. విలీనం తర్వాత పన్నుల భారం లేకుండా మరో మూడేళ్ల వరకు యధావిధిగా పన్నులు వసూలు చేయనున్నట్లు సమాచారం. అ దేవిధంగా ప్రతీ ఇంటికి తాగునీటి వసతి కల్పిం చేందుకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ను అంది ంచనున్నారు. రాబోయే రోజుల్లో మిషన్‌భగీరథ కింద ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి నీటి సరఫరాను మెరుగుపర్చే ప్రక్రియపై దృష్టిసారిం చారు. పట్టణానికి ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పి ంచేందుకు నిదుల కేటాయింపు సైతం చేస్తున్నా రు. ఇక గ్రామాలు నగరంలో విలీనం కావడంతో స్థిరాస్తుల విలువలు సైతం రెట్టింపవుతున్నాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో పారి శుధ్యం మెరుగుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు. ప్రతీ గ్రామానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్కు బాధ్యతలు అప్పగించి పనులు పూర్తిచేసేందుకు ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో దుమ్ముదూళి లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరి శుభ్రం చేసుకునే విధంగా చైతన్య పరుస్తున్నారు. వీధిదీపాలకు మరమ్మతులు గ్రామపంచాయతీల్లో వెలగని వీధిదీపాలకు మరమ్మతు చేస్తూ చీకట్లలో మగ్గుతున్న కాలనీలకు వెలుగులు నింపుతున్నారు. ఎల్ఈడీ వీధిదీపాలు అందుబాటులోకి వచ్చాక, వాటిస్థానంలో తొలగించిన ఎస్‌యూ, హైమాస్ లైట్లను ప్రస్తుతం గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రధాన చౌరస్తాలో ఈ బల్బులను బిగిస్తుండడంతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుంటుంది. అయితే గ్రామాల ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలనే ఇబ్బంది లేకుండా గ్రామపంచాయతీ ప్రస్తుత వార్డు కార్యాలయాల్లో అధికారుల నంబర్లు అంటించారు. దీంతో ఏ అవసరమున్నా ఫిర్యాదు చేసే వీలుంటుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో ఇక నుంచి ఇంటి అనుమతులన్నీ ఆన్లైన్లోనే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన డీపీఎంఎస్‌కు లింక్ చేశారు. ఇందు కోసం గ్రామాలకు చెందిన ఇంటి నంబర్లను సైతం తీసుకొని ఆన్లైన్ చేయనున్నారు. ఆయా గ్రామాలను అటాచ్ చేసిన డివిజన్లకు బాధ్యులుగా ఉన్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఇంటి అనుమతులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు పౌరసేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు నగరంలో ఏవిధంగా సేవలు అందుతున్నాయో.. విలీన గ్రామాల ప్రజలకు సైతం అదే విధంగా సేవలు అందించనున్నారు. వేగంగా అభివృద్ధి పనులు విలీన గ్రామాలను నగర డివిజన్లకు ధీటుగా అభివృద్ది చేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాం. కార్పొరేషన్లో కలిస్తే ఎన్ని సౌకర్యాలు ఉంటా యో అన్ని కల్పిస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంచాయితీలో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, కారొబార్ తదితర సిబ్బందిని కార్పొరేషన్ వర్కర్లుగా గుర్తించాం. టౌన్‌ప్లాన్, ఇంజనీరింగ్, శానిటేషన్, వీధిదీపాలు, నీటి సరఫరా ఇలా అన్ని విభాగాల నుంచి నగర ప్రజలు పొందే సౌకర్యాలన్నీ కల్పిస్తాం. – సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ -
స్వచ్ఛత సమరం
కరీంనగర్‌కార్పొరేషన్: పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ స్వచ్ఛత సమరం చేపట్టింది. దేశ వ్యాప్తంగా స్వచ్ఛతపై జరుగుతున్న పోటీలో పదిలోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. పరిశుభ్ర నగరాలను గుర్తించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పేరుతో పారిశుధ్యంపై సర్వే చేపట్టి ర్యాంకులు నిర్వహించనుంది. కేంద్ర బృందం సర్వేలో ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త వేరుచేయడం, జనావాసాల్లో చెత్త వేయడం, పబ్లిక్ టాయిలెట్లు, డంప్‌యార్డులు, నగర పరిశుభ్రతపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛభారత్ అమలు సక్రమంగా ఉంటేనే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కరీంనగర్‌కార్పొరేషన్: 2015వ సంవత్సరంలో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అయితే.. 2018లో 4,041 నగరాలు స్వచ్ఛత ర్యాంకు కోసం పోటీపడగా 73వ ర్యాంకు సాధించి దేశ వ్యాప్తంగా కరీంనగర్ ఖ్యాతిని చాటిచెప్పింది. ఈ ఏడాది సైతం పోటీ తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. నగర పాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న 10లోపు ర్యాంకు సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలనే ఉద్దేశంతోనే ముందుకు కదులుతున్నారు. అయితే.. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే మంచి ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపడాలి.. నగరంలోని 50 డివిజన్లలో 62 వేల నివాస గృహాలుండగా, సుమారు 72 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 200 టన్నుల చెత్త వెలువడుతోంది. అయితే.. చెత్తసేకరణ నుంచి డంపింగ్ వరకు అన్నీ అవాంతరాలే ఏర్పడుతున్నాయి. స్వచ్ఛభారత్ ఇచ్చిన మార్కులు సాధించాలంటే తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ జరగాల్సి ఉంది. మురుగు కాలువల శుభ్రత రెగ్యులర్‌గా లేకపోవడం, పూడికను వెంటవెంటనే తొలగించకపోవడం, డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోవడం వంటి అంశాలు పోటీలో ఇబ్బంది పెట్టనున్నాయి. దీనికితోడు వీధుల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఇదంతా మార్కులపై ప్రభావం చూపనుంది. ప్రజల భాగస్వామ్యంతోనే.. నగరపాలక ఆధ్వర్యంలో అమలు చేస్తున్న విధానాలపై నగరవాసులు అవగాహన పెంచుకుంటే పరిశుభ్రత కష్టమేమీ కాదు. ఇంట్లోని చెత్తను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసి పారిశుధ్య కార్మికులకు అప్పగించడం, తడి చెత్తను మురుగుకాల్వల్లో పడేయకుండా ఉంటే చాలు. దీంతో పందుల సంచారం, దుర్వాసన పూర్తిగా దూరమవుతుంది. అప్పుడే స్వచ్ఛ నగరంగా రూపుదిద్దుకుంటుంది. వంద రోజుల ప్రణాళిక.. కరీంనగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో మంచి ర్యాంకు సాధించాలంటే గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకునే తడి, పొడి చెత్త వేరు చేయడం, డీఆర్‌సీసీల మెయింటెనెన్స్, ఓడిఎఫ్, పబ్లిక్, కమ్యూనిటీ, షీ టాయిలెట్స్ శుద్ధి, తడి–పొడి చెత్తపై అవగాహన, శానిటేషన్ వాహనాల మెయింటెనెన్స్, వర్మికంపోస్టుల ఏర్పాటు, వాహనాల మెయింటెనెన్స్, డంప్‌యార్డు నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించారు. వంద రోజుల్లో వీటన్నింటిపై పట్టు సాధిస్తేనే స్వచ్ఛసర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. 10 లోపు ర్యాంకే లక్ష్యం.. కరీంనగర్ నగరపాలక సంస్థ గతంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ చాలెంజ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 2019లో 10లోపు ర్యాంకు సాధించేందుకు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నాం. ఫలితాన్ని రాబట్టేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. – రవీందర్‌సింగ్, మేయర్ -
స్వచ్ఛ పాకిస్తాన్ లక్ష్యం: ఇమ్రాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ను యూరప్ కంటే పరిశుభ్రమైన దేశంగా మారుస్తానని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. దేశంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ప్రచారోద్యమం ‘క్లీన్ అండ్ గ్రీన్ పాకిస్తాన్’ను ఇమ్రాన్ శనివారం ప్రారంభించారు. ‘దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా విద్యార్థులు, యువతను కోరుతున్నా. వచ్చే ఐదేళ్లలో కోటి మొక్కలను నాటి దేశాన్ని యూరప్ కంటే పరిశుభ్రంగా తయారు చేస్తా. ఈ కల నిజం కావాలంటే మన ఆలోచనలు మారాలి’ అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని నివారించేందుకు మొక్కలు నాటాలన్నారు. గ్లోబల్ వార్మింగ్‌లో పాక్ ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉండగా లాహోర్‌లో కాలుష్య స్థాయిలు అతి ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం కింద నగరాలతోపాటు పల్లెల్లో, మురికినీటి, పారిశుధ్య వ్యవస్థలను మెరుగు పరుస్తామని ప్రధాని ఇమ్రాన్ చెప్పారు. -
పల్లె మెరవాలె
సాక్షి, హైదరాబాద్: పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన పల్లెల కోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని సూచిం చారు. వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనులు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలనూ గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చెప్పారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, పీకే ఝా, వికాస్‌రాజ్, నీతూప్రసాద్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నెల రోజులపాటు చేపట్టాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలను, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలను నాటాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు సీఎం చేసిన సూచనలివీ.. వదిలేసిన గుంతలు, ఉపయోగించని, పాడుపడిన బావులను పూడ్చేయాలి. కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. హా గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలు పెంచాలి. పిచ్చిమొక్కలను, సర్కారు తుమ్మలను, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కచ్చితంగా నిర్మించాలి. హా గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్యపరిచి వారానికోసారి శ్రమదానం చేయించాలి. పచ్చదనం పెంచేందుకు చేసిన సూచనలివీ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పు న మొత్తం 12,751 నర్సరీలను ఏర్పాటు చేయాలి గ్రామంలోని రైతులతో, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని దానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలి దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. రైతులు పొలం గట్ల మీద, బావుల వద్ద మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలోనూ మొక్కలు పెంచాలి. అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఆ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో జిల్లా విద్యాధికారులకు లేఖలు రాయాలి. ప్రత్యేకాధికారులు సేకరించాల్సిన వివరాలు గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి? గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? గ్రామంలో శ్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలాన్ని సేకరించాలి గ్రామంలో దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది. లేకుంటే ఏర్పాటు చేయాలి. గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఎలా ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి. పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి? -
స్వచ్చ సర్వేక్షనలో హైదరాబాద్ మెరుగు పడుతుందా?
-
తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్త ఏరివేత
బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం : జిల్లాలోని పుష్కరఘాట్లలో ఎప్పటికప్పుడు క్లీన్అండ్ గ్రీన్ చేస్తున్నారు. పుష్కారాలు ప్రారంభమై తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్తను ఏరివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెల్లారుజామునుంచి ఘాట్లకు భక్తుల వస్తుండడంతో వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తున్నారు. ప్రతి ఘాట్ వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసి చెత్తను అందులో వేయాలని అధికారులు మైక్‌ల ద్వారా చెబుతుండడంతో నేరుగా భక్తులు వాటిలోనే వేస్తున్నారు. రోజూ ఘాట్లలో నీటిస్థాయితోపాటు శుద్ధిని పరీక్షిస్తున్నారు. పుష్కరాల్లో లక్షాలాది మంది స్నానం చేసే ఘాట్లలో భక్తులకు ఎలాంటి చర్మవ్యాధులు ప్రబలకుండా పటిక(అలం)ను ఎప్పటికప్పుడు వేస్తూ నీటిని శుభ్రం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో 700 మంది పంచాయతీకార్యదర్శులు, 60 మంది ఈఓఆర్డీలు, 500 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతకు ప్రభుత్వం రూ.4కోట్లు కేటాయించినట్లు డీపీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కృష్ణపుష్కారాలకు వచ్చే లక్షాలాది మంది భక్తుల సౌకర్యార్థం ఎక్కడ కూడా ఘాట్లలలో చెత్తచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
గల్లీలు ఊడుస్తున్న ఢిల్లీ మంత్రులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి రోడ్లెక్కడంతో వారి బాధ్యతలు నెరవేర్చేందుకు ఆప్ మంత్రులు తట్టాబుట్టా, చీపుర్లు పట్టుకుని ఢిల్లీ వీధులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. వీరికి తోడు ఆప్ కార్యకర్తలు కూడా తోడవడంతో ఢిల్లీ వీధుల శుభ్రం చేసే కార్యక్రమం దండిగా సాగుతోంది. తమకు జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పీడబ్ల్యూడీ అధికారులు ప్రత్యేక టాస్క్ పోర్స్ ను ఉపయోగించి ఢిల్లీ వీధులను శుభ్రం చేయిస్తున్నారు. వీరితోపాటు ఆ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ షాదారా ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా మంత్రులు కపిల్ మిశ్రా, ఇమ్రాన్ హుస్సేన్ కారవల్ నగర్, బల్లిమారన్ ప్రాంతంలో చెత్తచెదారం ఊడుస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పార్పంజ్ ప్రాంతంలో వీధులు ఊడ్చే కార్యక్రమం చేపట్టనున్నారు. -
క్లీన్ అండ్ గ్రీన్ సిటీ
రేపటి నుంచి స్వచ్ఛ హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ 17 నుంచి 20 వరకు బస్తీల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: ప్రజలందరి భాగస్వామ్యంతో ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం నుంచి 20వ తేదీ వరకు చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణను ఆయన వెల్లడించారు. కేవలం నాలుగు రోజులకు పరిమితం చేయకుండా నెలలో ఒకరోజు ‘స్వచ్ఛ హైదరాబాద్’ నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని తెలంగాణను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని.. ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో గురువారం సచివాలయంలో కేసీఆర్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కంటోన్మెంట్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. రహదారులను అంతర్జాతీయ స్థాయిలో సిగ్నల్ రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల మార్కెట్లు, శ్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్స్, పార్కులు, బస్ బేలు నిర్మిస్తామన్నారు. సిటీని 425 విభాగాలుగా చేసినట్లు చెప్పారు. 17వ తేదీ నుంచి 20 వరకు అధికారుల బృందాలు తమకు కేటాయించిన ప్రాంతాలు, బస్తీల్లో పర్యటిస్తాయని సీఎం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంలో చెత్తను ఏరివేయడం, శిథిలాలను తొలగించడం వంటి పనులు చేపడతాయన్నారు. ప్రతి బృందానికి ఓ సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి ప్రేరకునిగా ఉంటారని, 15 మంది సభ్యులు చేంజ్ ఏజెంట్స్‌గా పనిచేస్తారని వివరించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసులు, సైనికులు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగానే బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి నివేదికను రూపొందించాలని, తక్షణం చేపట్టాల్సిన పనులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇలా సేకరించిన సమాచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా క్రోడీకరించి బుక్లెట్ రూపొందించాలని సూచించారు. బస్తీల్లో అప్పటికప్పుడు చేయదగిన పనులను వెంటనే పూర్తి చేయడానికి ప్రతి అధికారికీ రూ.50 లక్షల వరకు మంజూరు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికలపై కూలంకషంగా చర్చించేందుకు నగర ప్రజా ప్రతినిధులతో ఈ నెల 26న సమావేశం నిర్వహిస్తామన్నారు. కాగా, స్వచ్ఛ హైదరాబాద్‌కు అన్ని విధాల సహకరిస్తామని దత్తాత్రేయ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్ర మాన్ని పెద్దఎత్తున చేపడుతున్న ఘనత తెలంగాణదేనన్నారు. దీంతో మనమే నెంబర్ వన్‌గా నిలుస్తామన్నారు. -
జియోట్యాగింగ్‌తో అవినీతికి అడ్డుకట్ట
- మరుగుదొడ్ల నిర్మాణం శతశాతం పూర్తి చేయాలి - మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ ఆశాజ్యోతి యలమంచిలి : కొత్తగా ప్రవేశపెట్టిన జియోట్యాగింగ్ విధానంతో గృహనిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని మున్సిపల్ విశాఖపట్నం ప్రాంతీయ సంచాలకులు పి.ఆశాజ్యోతి అభిప్రాయపడ్డారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రలో భాగంగా మంగళవారం యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు.యలమంచిలి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చేందుకు మొదటిగా ప్రతి ఇంటిలోనూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో 3,030 మంది వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.11వేలు మొత్తం రూ.15వేలు అందజేస్తామన్నారు. ఎవరైనా మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోతే కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి తమ శాఖ పర్యవేక్షణలోనే మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. జియోట్యాగింగ్ విధానం అమలులోకి రావడం వల్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం లేదన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయగలిగితే పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం శతశాతం పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత వార్డు కౌన్సిలర్లపై కూడా ఉందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొఠారు సాంబ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు పూర్తిగా తాగునీరు అందించలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వాటికి నీరెలా అందించగలుగుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సత్తారు శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
61 రోజులు చేపల వేట నిషేధం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో 61 రోజల పాటు చేపల వేటను నిషేధిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిషేధించిన సమయంలో చేపల వేటకు వెళ్లే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
త్వరలో కాలుష్య రహిత బస్సులు
న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేటు వాహనాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికమైన కాలుష్య రహిత బస్సులను ప్రవేశపెట్టనుంది. నగరంలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ అత్యాధునిక బస్సులను త్వరలో రవాణా విభాగంలోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎర్త్ డే సందర్భంగా బుధవారం ఢిల్లీ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేం దుకు విస్తృత ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు కూడా ఇందు లో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. దీపావళి మందు సామాగ్రికి దూరంగా ఉండాలని కోరారు. అంతే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కాలుష్య రహిత బస్సులను ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రైవేట్ వాహనాలను వినియోగించే వారి సంఖ్యను తగ్గిం చేందుకు యత్నిస్తామని చెప్పారు. నగరా న్ని ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కిం చేందుకు విద్యార్థులు కూడా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని తమ తల్లిదండ్రులకు సూచించాలని విద్యార్థుల కు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆప్ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. దీని కోసం వాతావరణ మార్పులు, ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు, నీటి కాలుష్యం, శానిటేషన్, పచ్చదనం, ఇంధన వనరులపై చర్చా గోష్టి నిర్వహించడం ద్వారా పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు. ఎర్త్ డే సందర్భంగా ఎకో క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలకు రాష్ట్ర పర్యావరణ మంత్రి అసీం అహ్మద్ ఖాన్ బహుమతులు అందజేశారు. -
క్లీన్ అండ్ గ్రీన్
* మూసీ ప్రక్షాళనలో ముందడుగు * రూ. 160 కోట్ల అంచనాలతో సిద్ధమైన సమగ్ర పథకం * ఎన్ఆర్సీపీ నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదించనున్న టీ సర్కారు * ఆమోదం లభిస్తే కేంద్రం నుంచి రూ. 103.68 కోట్ల సాయం * మూసీ పరిరక్షణ, తీర ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు * నీటి శుద్ధి, మురుగునీటి మళ్లింపు, పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి * 2017 మార్చిలోగా రెండు విడతల్లో పనులు పూర్తి * నివేదికలో ప్రస్తావనే లేని రసాయన వ్యర్థాల శుద్ధి * సవివర ప్రాజెక్టు నివేదికను సంపాదించిన ‘సాక్షి’ సాక్షి, హైదరాబాద్: విష జల రాకాసిగా మారిన మూసీ నది ప్రక్షాళన దిశగా ముందడుగు పడింది. పారిశ్రామిక, గృహ వ్యర్థాలతో కలుషితమైన మూసీ నీటి శుద్ధీకరణ, సుందరీకరణ పథకంపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఒకప్పటి జీవధారలో ఇప్పుడు జీవుల మనుగడే కష్టంగా మారిన తరుణంలో దాని ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి సమగ్ర నివేదిక(డీపీఆర్) సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే మూసీలో భారలోహాల తీవ్రత పెరిగి, ఆ నీటితో పండిన పంటలు, కాయగూరల్లోనూ ప్రమాదకర మూలకాల ఆనవాళ్లు తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న ‘ఆర్వీ అసోసియేట్స్’ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ మూసీ ప్రక్షాళనపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా రూ. 160 కోట్ల అంచనా వ్యయంతో ‘మూసీ నది పరిరక్షణ, నదీగట్టు అభివృద్ధి’ (కన్జర్వేషన్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆఫ్ మూసీ రివర్) ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని ఆధారంగా ‘జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక(ఎన్ఆర్సీపీ)’ కింద మూసీ ప్రక్షాళనకు నిధులు కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది. ఎన్ఆర్సీపీ కింద చేపట్టే ప్రాజెక్టులకు 70 శాతం నిధులనుకేంద్రమే భరిస్తుంది. మిగిలిన 30 శాతాన్ని రాష్ట్రం భరించాలి. తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే కేంద్ర వాటా కింద రూ. 103.68 కోట్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం మూసీ పరిరక్షణ, నదీ తీర అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్ఎఫ్డీఏ)ను ఏర్పాటు చేయాలని కూడా నివేదికలో ప్రతిపాదించారు. ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. రెండు విడతల్లో పనులు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభించి 2017 మార్చిలోగా పూర్తి చేసేలా ప్రతిపాదనలు తయారు చేశారు. తొలి విడతలో భాగంగా రూ. 109.08 కోట్లు, రెండో విడతలో రూ. 50.92 కోట్లను ఖర్చు చేస్తారు. నదీ తీరం/గట్టు(రివర్ ఫ్రంట్) అభివృద్ధి ఒక విభాగం కాగా, నది సంరక్షణ మరో విభాగంగా భారీ స్థాయిలో పనులు చేపట్టనున్నారు. * శుద్ధీకరణలో భాగంగా నదిలో బురద, నాచు, గడ్డి, రసాయనిక వ్యర్థాలను తొలగిస్తారు. * నదీ గట్టు దృఢంగా ఉండేలా అవసరమైన చోట తవ్వకాలు, పూడ్చివేతలు చేసి గట్టును సమతలంగా తీర్చిదిద్దుతారు. దానిపై గడ్డి పెంచుతారు. మురుగు నీటి నాలాలపై పాదచారుల కోసం కల్వర్టులను నిర్మిస్తారు. * నాగోల్ బ్రిడ్జి నుంచి పీర్జాదిగూడలోని నారాయణరావు అలుగు వరకు గల 5 కిలోమీటర్ల మూసీ ఉత్తర తీరాన్ని సుందరంగా మార్చుతారు. ప్రతాప్సింగారాం-గౌరెల్లికి మధ్యనున్న వారధికి ఇరువైపులా 2.6 కిలోమీటర్ల తీరాన్ని కూడా అభివృద్ధిపరుస్తారు. ఈ రెండు చోట్ల సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, హరిత ప్రదేశం, పౌర సౌకర్యాలతో 13 మీటర్ల కారిడార్లను నిర్మిస్తారు. * ముత్యాలగూడ-ప్రతాప్‌సింగారం మార్గంలో గల కొండపై అతిథి గృహం, కేఫ్‌ను నిర్మిస్తారు. పైనుంచి మూసీ అందాలను వీక్షిం చేలా రెండంతస్థుల భవనాన్ని నిర్మిస్తారు. * నారాయణరావు అలుగు వద్ద ఓ పార్కును, ప్రతాప్‌సింగారంలోని రెండు అలుగుల వద్ద మరో రెండు పార్కులను అభివృద్ధి చేస్తారు. సుందరంగా మారనున్న నదీ తీరం నాగోల్-గౌరెల్లి మధ్య గల మూసీ తీర ప్రాంతం భవిష్యత్తులో నగరాభివృద్ధికి చిరునామాగా మారనుంది. ఈ నిడివిలోని నాలుగు వేర్వేరు తీర ప్రాంతాల అభివృద్ధికి ‘నిర్దిష్ట ప్రాంతల అభివృద్ధి ప్రణాళిక’(ఏడీపీ)లను రూపొందించారు. ఎన్ఆర్సీ డెరైక్టరేట్ మార్గదర్శకాల ప్రకారం మూసీ జలాల శుద్ధీకరణ, నది కరకట్టల స్థిరీకరణ(రివర్ బ్యాంక్ స్టెబిలైజేషన్), కాలిబాటలు, నదీగట్టు సంరక్షణ, వ్యూహాత్మక ప్రాంతాల్లో నీటి కుంటల ఏర్పాటు, పౌరులకు సౌకర్యాలు, వినోద సౌకర్యాలు, రహదారి మార్గాలు, తోట లు, హరిత ప్రదేశాలను నిర్మించనున్నారు. స్వచ్ఛమైన నీటి నిర్వహణ కోసం మూసీపై ఉన్న ఐదు అలుగుల వద్ద నీటి కుంటలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాలాల మరుగు నీటిని ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. నీటి శుద్ధి ఇలా.. ప్రస్తుతం మూసీకి ఉత్తరాన గల 6 గ్రామాల పరిధిలోని 32 చదరపు కిలోమీటర్ల తీరంతో పాటు దక్షిణ తీరంలో 4 గ్రామాల పరిధిలోని 17.25 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో మురుగు నీరు, వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాలను భారీ కాంక్రీటు పైపుల ద్వారా మురుగునీటి శుద్ధి కర్మాగారాల(ఎస్టీపీ)కు మళ్లించి శుద్ధి చేస్తారు. దీని కోసం పీర్జాదిగూడ, కొర్రెముల గ్రామాల వద్ద 20 ఎంఎల్డీల సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అలాగే ముత్యాలగూడ, మర్రిపల్లె, ఖుత్బుల్లాపూర్, తిమ్మాయిగూడ గ్రామాల నుంచి మురుగు నీరు మూసీలో చేరకుండా గ్రామానికొక కమ్యూనిటీ సెప్టిక్ ట్యాంక్(సీఎస్టీ)ను ఏర్పాటు చేస్తారు. మరి రసాయనాల శుద్ధి ఎలా? పారిశ్రామిక రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఈటీపీ)లను ఏర్పాటు చేస్తేనే మూసీ జలాలను పూర్తి స్థాయిలో శుద్ధిచేయడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, హెచ్ఎండీఏ రూపొందించిన నివేదికలో ఎక్కడా వీటి ప్రస్థావన లేదు. పటాన్చెరు, జీడిమెట్ల, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి తరలిస్తున్న పారిశ్రామిక రసాయన వ్యర్థాలు ఏళ్ల తరబడి మూసీని కలుషితం చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన లెడ్, జింక్, క్రోమియం, కాపర్ తదితర రసాయనిక ధాతువులతో నదీ గర్భం పూర్తిగా విషతుల్యమైపోయింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలపై మూసీ జలం విషం చిమ్ముతోంది. ప్రాజెక్టు నివేదికలో ప్రతిపాదించిన ఎస్టీపీలు రసాయనేతర మురుగు నీటి శుద్ధికి మాత్రమే ఉపయోగపడనున్నాయి. మరి రసాయన కాలుష్యాన్ని ఎలా తొలగిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపాదిత ప్రణాళికలు ఏపీడీ 1: ఉప్పల్-పీర్జాదిగూడ నదీగట్టు అభివృద్ధి ఏడీపీ 2: పత్రాప్సింగారం-గౌరెల్లి నదీగట్టు అభివృద్ధి ఏడీపీ 3: ముత్యాలగూడ వద్ద రివర్ వ్యూ అతిథి గృహం, కేఫ్ ఏడీపీ 4: పీర్జాదిగూడలోని నారాయణరావు అలుగుతో పాటు ప్రతాప్‌సింగారంలోని రెండు అలుగుల వద్ద ఉద్యానవనం -
క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సిద్దిపేట
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని వివిధ కాలనీల్లో రూ. 65 లక్షల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలో విలీనమైన గ్రామాలతో పాటు పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పరిశుభ్రమైన పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో పచ్చదనం కోసం గతంలోనే విస్తృతంగా మొక్కలు నాటామన్నారు. మొక్కలు వృక్షాలుగా మారేవరకు స్థానికులు సంరక్షించాలన్నారు. నియోజకవర్గ ప్రజల అండదండలు, ఆధారాభిమానాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఇందిరానగర్ నార్త్‌లో రూ. 15 లక్షలు, ఇందిరానగర్ సౌత్‌లో రూ.10 లక్షలతో నిర్మించే మురుగు కాల్వలకు, హనుమాన్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 10 లక్షలు, రంగధాంపల్లిలో రూ. 10 లక్షలు, శంకర్‌నగర్‌లోని రెండు రోడ్లను పొడగించే పనులకు రూ. 10 లక్షలు, నాసర్‌పురాలో డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం కోసం రూ. 10 లక్షలతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో మంత్రి హరీష్‌రావుకు స్థానిక మహిళలు మంగళహారతులతో తిలకం దిద్ది స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, నయ్యర్ పటేల్, జంగిటి కనకరాజు, గుండు శ్రీనివాస్‌గౌడ్, మోహన్‌లాల్, శేషుకుమార్, నల్ల నరేందర్‌రెడ్డి, జనార్దన్, నాయకం వెంకట్, దర్పల్లి శ్రీను, కొండం సంపత్‌రెడ్డి, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ప్రసన్నకుమార్, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికి పింఛన్ ఇస్తాం సిద్దిపేట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుందని, ఈ నెల 25న పంపిణీ చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని బంజేరుపల్లిలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెల నుంచి బియ్యం కోటాను 4కిలోల నుంచి 6కిలోలకు పెంచుతున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికీ ఆరు కిలోల చొప్పున ఇస్తామని తెలిపారు. అలాగే బంజేరుపల్లి గ్రామానికి దశలవారీగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్డు రూ.10లక్షలతో నిర్మాణం చేశామన్నారు. అదే విధంగా మరో రూ. 5లక్షలు సీసీ రోడ్డుకు, రూ. 6లక్షలు మహిళ భవనానికి మంజూరు చేయిస్తానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 శాతం పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వం గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి రూ. 2లక్షలు మంజూరు చేసిందన్నారు. వాటితో వాటర్ మిషన్ తెచ్చామని, అదే విధంగా స్తంభానికి తమ వంతు సాయంగా రూ. 1.50లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్‌రావు, గ్రామ సర్పంచ్ భూమయ్య, ఎంపీటీసీ రోమాల శాంత రాజయ్య, అర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌చారి, నాయకులు బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేయి చేయి కలుపుదాం..చెత్తకు టాటా చెబుదాం..
ఖైరతాబాద్: చారిత్రక నేపథ్యమున్న భాగ్యనగరం ఎన్నో అందాలు నెలవు. హైటెక్ సిటీగా గుర్తింపు పొందిని గ్రేటర్లో రోజు రోజుకు పేరుకుపోతున్న చెత్తను అరికట్టి క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకోసం నగరంలో 36 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను గుర్తించి ఆయా రోడ్లలో ‘చెత్త రహిత సమాజం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ పరిధిలోని నెక్లెస్ రోడ్డు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, డీఎంసీ సోమరాజుతో పాటు నెక్లెస్ రోడ్డులో వ్యాపారాలు చేస్తున్నవారితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు వ్యాపారులు రోడ్లపై పడకుండా బ్యాగుల్లో వేసుకోవాలని, రోజూ మెక్లిన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది, వాహనాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ చెత్తను ఆయా వాహనాలలో వేయాలని సూచించారు. మెక్లిన్ సంస్థ ఎండీ ప్రేమానంద్ మాట్లాడుతూ రోజూ షిఫ్ట్‌ల వారీగా వాహనాలు తిరుగుతాయని తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ ఏఎంహెచ్ఓలు డాక్టర్ దామోదర్, మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఈ ప్రాంతాల్లో అమలు.. మహా నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెత్త రహిత సమాజ నిర్మాణంలో భాగంగా తొలుత ఏడు ప్రధాన రోడ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. * బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 2 నుంచి నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా పెద్దమ్మ ఆల యం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92 నుంచి కళింగ ఫంక్షన్ హాల్, సి.వి.ఆర్ న్యూస్ చానెల్ మీదుగా చెక్‌పోస్ట్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం. 12 పెన్షన్ ఆఫీస్, ఇన్కమ్ టాక్స్ కార్యాలయం మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జీవీకే మాల్, జలగం వెంగళరావు పార్కు మీదుగా పెన్షన్ ఆఫీస్ వరకు * ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమాజిగూడ, సీఎం క్యాంపు కార్యాలయం, బేగంపేట్ ఫ్లై ఓవర్ వరకు * బేగంపేట్ మీదుగా గ్రీన్‌ల్యాండ్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రోడ్లలో అమలు చేస్తున్నారు. అతిక్రమిస్తే జరిమానా వచ్చే నెల 1న చెత్త రహిత సమాజ నిర్మాణంపై నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఆ తరువాత షాపులు, తోపుడు బండ్లు.. ఇలా వ్యాపారాలు చేసుకునేవారి షాపుల ముందు చెత్త కనిపిస్తే మొదటి తప్పిదం కింద రూ.500, రెండోసారి రూ.1000, మూడోసారి రూ.3000, నాలుగోసారి రూ.4000, ఐదోసారి రూ. 10 వేల జరిమానా విధిస్తామన్నారు. ఆ తరువాత కూడా అదే తప్పిదం చేస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు. -
మురికిపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్
గజ్వేల్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో పరిశుభ్రతపై కేసీఆర్ దృష్టి సారించారు. పల్లెల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రత కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. నెల రోజుల్లోగా చెత్తను పూర్తిగా తొలగించాలని మెదక్ జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విత్తనాలను బ్లాక్ చేసిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు కేసీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి అధికారికంగా మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. -
వైఎస్ వెలుగులు
సాక్షి, గుంటూరు: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పట్టణాల్లోని మురికివాడలకు కోట్ల రూపాయలు వెచ్చించారు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. కొన్ని మున్సిపాలిటీలకు నూతన భవనాలు, పట్టణాల్లో సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లను కోట్ల నిధులతో నిర్మించి పట్టణాలకు కొత్త కాంతులు తెచ్చిపెట్టారు. అంతేకాక అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకం ద్వారా మురుగునీరు రోడ్లపై కనిపించకుండా మున్సిపాలిటీలను క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసిన ఘనత ఆయనకే దక్కింది.అయితే ఆయన మరణంతో పట్టణాభివృద్ధి నిలిచిపోయింది. ఇప్పటి వరకు పట్టణ ప్రజల బాధలు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడని, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెబుతామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి... మంగళగిరిలో రూ. 60 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.వైఎస్ మరణంతో ఇవన్నీ ఆగిపోయాయి. తొలి విడతలో 504 మంది నిరుపేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాలిటీగా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. 40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆయన మరణంతో అది కాస్తా నిలిచిపోయింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్ అకాల మరణంతో ఆ పథకాన్ని పట్టించుకున్న దిక్కే లేకుండా పోయింది. వైఎస్సార్ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు. సత్తెనపల్లిలో రూ. 14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువు తవ్వించారు. రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌ెహ డ్ ట్యాంకులు పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం చేశారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్లు అందించారు. చిలకలూరిపేటలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్లు మంజూరు చేశారు. నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, రూ. 8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నరసరావుపేటలో రూ.44 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పథకానికి శంకుస్థాపన చేశారు. రూ. 22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, రాజీవ్ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు. బాపట్లలో రూ.49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. రూ. 2 కోట్ల వ్యయంతో గృహ సముదాయాలు నిర్మించారు. తెనాలిలో రూ. 100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణంతో ఆ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. మహానేత వైఎస్సార్ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాలిటీగా మార్చి రూ. 30 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేశారు. రూ. 15 కోట్లతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. రేపల్లెలో రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణం చేశారు. వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీచేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేశారు. పొన్నూరు మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారు. మరో కోటితో హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు.