మురికిపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్‌ | KCR concentrating on clean and green in all Telangana districts | Sakshi
Sakshi News home page

మురికిపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్‌

Published Wed, Jun 4 2014 8:56 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

మురికిపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్‌ - Sakshi

మురికిపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్‌

గజ్వేల్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో పరిశుభ్రతపై కేసీఆర్ దృష్టి సారించారు. పల్లెల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.  తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రత కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. 
 
నెల రోజుల్లోగా చెత్తను పూర్తిగా తొలగించాలని మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విత్తనాలను బ్లాక్‌ చేసిన వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని అధికారులకు కేసీఆర్ తెలిపారు. 
 
ముఖ్యమంత్రి  పదవి చేపట్టిన తర్వాత తొలిసారి అధికారికంగా మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement