స్వచ్ఛ పాకిస్తాన్‌ లక్ష్యం: ఇమ్రాన్‌ | PM Imran kicks off Clean and Green Pakistan | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ పాకిస్తాన్‌ లక్ష్యం: ఇమ్రాన్‌

Published Sun, Oct 14 2018 4:39 AM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

PM Imran kicks off  Clean and Green Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ను యూరప్‌ కంటే పరిశుభ్రమైన దేశంగా మారుస్తానని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. దేశంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ప్రచారోద్యమం ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాకిస్తాన్‌’ను ఇమ్రాన్‌ శనివారం ప్రారంభించారు. ‘దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా విద్యార్థులు, యువతను కోరుతున్నా. వచ్చే ఐదేళ్లలో కోటి మొక్కలను నాటి దేశాన్ని యూరప్‌ కంటే పరిశుభ్రంగా తయారు చేస్తా. ఈ కల నిజం కావాలంటే మన ఆలోచనలు మారాలి’ అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని నివారించేందుకు మొక్కలు నాటాలన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌లో పాక్‌ ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉండగా లాహోర్‌లో కాలుష్య స్థాయిలు అతి ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం కింద నగరాలతోపాటు పల్లెల్లో, మురికినీటి, పారిశుధ్య వ్యవస్థలను మెరుగు పరుస్తామని ప్రధాని ఇమ్రాన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement