సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోద ముద్ర పడిన అనంతరం ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఆదిలాబాద్ నుంచి బెజ్జంకి అనీల్‌కుమార్ అభ్యర్థిత్వం ఖరారైంది. నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి పోటీ చేయనున్నారు. సిర్పూర్ అభ్యర్థిగా ముస్లీం మైనార్టీ వర్గానికి చెందిన షబ్బీర్ హుస్సేన్ పేరు ఖరారైంది. ఆసిఫాబాద్(ఎస్టీ) అభ్యర్థిగా మేస్రం శంకర్‌ను బరిలో దించుతోంది. ఈ నియోజకవర్గంలో పర్థాన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 20 వేలకు పైగా ఉంటారు.
ఇదే సామాజికవర్గానికి చెందిన నాయకున్ని పోటీ చేయించడం ద్వారా ఆదివాసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రమీల చెన్నూరు(ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు. బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి విద్యావేత్త రాజ్‌కిరణ్ అభ్యర్థిత్వం ఖరారైంది. మంచిర్యాల నుంచి సయ్యద్ అఫ్జలుద్దీన్ పోటీ చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. అభ్యర్థుల జాబితాలో మైనార్టీలకు పెద్ద పీట వేశారు. ఇద్దరు అభ్యర్థులను ముస్లీం మైనార్టీల నుంచి ఎంపిక చేశారు. మహిళలకు కూడా ప్రాధాన్యత దక్కింది. ఆదిలాబాద్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అనీల్‌ను బరిలో దించుతోంది. ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాల్లో ఆదివాసీలకు ప్రాధాన్యత కల్పించడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ దండు
Published Wed, Apr 9 2014 2:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement