
పేరాశ...
‘‘పేరు మార్చుకున్నా చూసుకో... నోరు తిరగకపోతే మూసుకో...’’ అంటోందా టీచరమ్మ. కొలంబియాలోని బొగొటా నగరానికి చెందిన 36
‘‘పేరు మార్చుకున్నా చూసుకో... నోరు తిరగకపోతే మూసుకో...’’ అంటోందా టీచరమ్మ. కొలంబియాలోని బొగొటా నగరానికి చెందిన 36 ఏళ్ల ఈ ఉపాధ్యాయురాలికి తరచూ తన పేరు మార్చుకునే సరదా ఉంది. ఇప్పటికే పలుమార్లు పేర్లు మార్చుకున్న ఈమె రెండేళ్ల క్రితం కూడా పేరు మార్చుకుంటూ దరఖాస్తు చేస్తే ఆ పేరు చూసి గుడ్లు తేలేసిన అధికారులు ‘‘పేరంటే పేరంటం కాదు... నీ తీరేంటో మాకర్ధం కాదు’’ అంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఒళ్లు మండిన సదరు టీచరమ్మ మూడ్స్ ప్రకారం నేమ్స్ మార్చుకునే తన హక్కును కాపాడాలంటూ న్యాయపోరాటానికి దిగింది. రెండేళ్ల పోరాటంతో దిగివచ్చిన అధికారులు ఆమె దరఖాస్తును అంగీకరించక తప్పలేదు. తనకు న్యాయం జరిగిందంటున్న ఈ టీచరమ్మ పాత పేరు లేడీజుంగా సైబర్గ్ కాగా పోరాడి సాధించుకున్న మరో పేరేంటో తెలుసా...?
’అఆఇఈఉఊఎఏఐఒఓఔకూై్కఖఖఖ్ఖీగగిగీో్గ’. ఆల్ఫాబెట్‌లోని 26 అక్షరాలను కలిపి కుట్టేసిన ఈమె... ‘‘పలుకగ నోరు తిరగని పేర్లు నాకిష్టం... పిలవలేకపోతే అది మీకష్టం’’ అంటోంది. ఆశ్చర్యపోయేలా జీవించడమే తనకు నచ్చే జీవనం అంటున్న ఈమె... ఆర్ట్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్‌లలో శిక్షకురాలు.