![బ్యాన్ ఆన్ జంక్](/styles/webp/s3/article_images/2017/09/3/81430853271_625x300.jpg.webp?itok=iivSXXmL)
బ్యాన్ ఆన్ జంక్
జంక్‌ఫుడ్ తయారీదార్లను జంకేలా చేస్తేనే బెటర్
ఇప్పుడు దేశవిదేశాలలో పొంచి ఉన్న భయం స్థూలకాయం. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు చేరడం, గుండెపోటు, పక్షవాతం, కీళ్లనొప్పులు, స్లీప్ ఆప్నియా, డిప్రెషన్, పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతున్న స్థూలకాయాని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు నడుం కట్టాయి.
ఉదాహరణకు...
బ్రిటన్ : ఈ దేశంలో 26 శాతం జనాభా స్థూలకాయులవుతున్నందున స్కూళ్లలో జంక్‌ఫుడ్ తినడంపై 2005 నుంచి నిషేధం విధించారు. అంతేకాదు 2008 నుంచి జంక్‌ఫుడ్ యాడ్స్‌ను సైతం నిషేధించారు.
అమెరికా : అమెరికాలోని స్కూళ్లలో జంక్‌ఫుడ్ తినడంపై నిషేధాన్ని గత ఏడాది జులై నుంచి విధించారు. కొవ్వుపాళ్లు 35% మించిన ఆహారాలను నిషేధించారు.
మనదేశంలోని పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి చర్యలే తీసుకుంటే రేపటి మన యువత ఆరో గ్యకరంగా ఉంటుందని వైద్య నిపుణుల అభిప్రాయం.