చైనా జనాభా బిలియన్‌కు చేరిక
ఆ నేడు 27 అక్టోబర్, 1982
ప్రపంచ జనాభాలో చైనాదే అగ్రస్థానం అని చిన్నపిల్లలకు కూడా తెలిసినప్పటికీ ఈ వేళ అంటే 1982 అక్టోబర్ 27న జన్మించిన ఓ చిన్నారితో చైనా జనాభా వందకోట్లను దాటిపోయిందట. అదే విషయాన్ని చైనా అధికారికంగా వార్తాపత్రికలలో ప్రకటించింది.అయితే దీనితోబాటు బిలియన్‌కు చేరిన తమ దేశ జనాభా ఇంకా ఇలాగే పెరుగుతూ పోతుంటే రానురానూ మౌలిక సౌకర్యాల కల్పన కష్టంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ప్రతి జంటా ఇకపై ఒక్క బిడ్డకే జన్మనివ్వాలని విజ్ఞప్తి చేసింది.
అన్నట్లు చైనా జనాభా లెక్కల సేకరణకు వినియోగించినది ఎంతమందినో తెలుసా? అక్షరాలా ఆరున్నర లక్షల మందిని. మూడు దశాబ్దాల క్రితమే జనాభా లెక్కల సేకరణకు ఆ దేశం వెచ్చించిన మొత్తం 104 మిలియన్ డాలర్లు. ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన మీదట ఈ ముప్పై ఏళ్లలోనూ ఆ దేశ జనాభా మరో నలభై కోట్లు మాత్రం పెరిగింది!