రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్, 8-10 గ్లాసుల మంచినీరు, తాజా ఆకుకూరలు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పండ్ల గుజ్జుతో రోజూ ఓ పది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్‌తో కలిపిన ఫేస్‌ప్యాక్ వేసుకొని, ఆరాక శుభ్రపరుచుకుని, మాయిశ్చరైజర్ లేదా లోషన్‌ని రాసుకోవాలి. పొడి చర్మం గలవారు నైట్ క్రీమ్స్ ఉపయోగిస్తే మంచిది. నైట్ క్రీమ్స్‌లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది చర్మాన్ని త్వరగా పొడిబారనివ్వదు. బాదం లేదా ఆలివ్ నూనెలతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు త్వరగా చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తాయి.
- సీమాఖాన్, సౌందర్యనిపుణులు
పెళ్లికూతురుకు ముఖకళ...
Published Wed, Feb 12 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement