పాజిటివ్ వైపు పరుగులు... | caretaking | Sakshi
Sakshi News home page

పాజిటివ్ వైపు పరుగులు...

Published Fri, Mar 6 2015 10:55 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

పాజిటివ్ వైపు పరుగులు... - Sakshi

పాజిటివ్ వైపు పరుగులు...

13-19 కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
కావ్య క్లాసులో ఎప్పుడూ టాపర్. టీచర్లు కూడా కావ్యని ఎప్పుడూ మెచ్చుకుంటూంటారు. అటువంటి కావ్యకి పదవతరగతి పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుండి దిగులు పట్టుకుంది. తెలియని భయంతో ఏడవడం, ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూడటం, క్లాసు అయ్యాక కూడా దిగులుగా క్లాసులోనే కూర్చుండిపోవడం చూసి టీచర్లు తల్లిదండ్రులకు చెప్పారు. ఇంటికి తీసుకెళ్లాక ఎంత బతిమాలినా కావ్య నోరు విప్పలేదు. చివరకు తల్లి రహస్యంగా ‘ఎవరైనా ఏదైనా అన్నారా?’ లాంటివి అడిగినా ‘ఛీ ఛీ అలాంటిదేమీ లేదు’ అని ఖండితంగా చెప్పేసింది. చేసేది లేక, ఒక పెద్దాయనకు చూపించారు. ఆయన ఒక తావీదు కట్టాడు. అయినా ఆమె భయం పోలేదు.

భయం ఎందుకంటే...

‘పరీక్షలు దగ్గరపడుతున్నాయి. నేను పాసవుతానో లేదో?’‘పాస్ అయినా.. మార్కులు తక్కువ వస్తే?’
 ‘సిలబస్‌లో లేని ప్రశ్నలు వస్తే ఏం చేయాలి?’ ‘ఒకవేళ నేను బాగా రాసిన పేపర్‌ను మరెవరికో మార్చి, వాళ్ల పేపరు మీద నా నంబరువేస్తే?’ ఇలాంటి భయాలతో మానసిక ఒత్తిడిని పెంచుకుంటుంటారు పిల్లలు.
 
జీనియస్ సిండ్రోమ్...

ఇలా ప్రతి చిన్నదానికి భయపడే తెలివైన స్టూడెంట్స్‌ని వేధించే ఈ రుగ్మతని ‘జీనియస్ సిండ్రోమ్’ అంటారు. తమ విజయాన్ని, తమ ర్యాంకుని మరొకరు కాజేస్తారేమోననే భయంతో ఉండే, ఈ స్టూడెంట్స్ నిరంతరం చదువు గురించే ఆలోచిస్తూ, అర్థం లేని ఆందోళన పెంచుకుంటారు. అటువంటి వారితో పాటు, ఇతరులకు కూడా పనికొచ్చే పరీక్షల చిట్కాలు...
 
యుద్ధానికి వెళ్లడం లేదు...

చాలా మంది పిల్లలు పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ ఆందోళన పెంచుకుని, తమకి తామే నెగెటివ్ సజెషన్లు ఇచ్చుకుంటుంటారు. అవి అర్థం చేసుకున్న మనసు అనే సబ్ కాన్షస్ మైండ్ వాటిని అక్షరాలా అమలుపరుస్తుంది. కాబట్టి సరదాకి కూడా ‘నాకు ఫలానా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తాయేమో’ అనకండి. ఎందుకంటే మీ సబ్‌కాన్షస్ మైండ్‌కి జోకులు అర్థం కావు. కాబట్టి ఎట్టి పరిస్థితిల్లోనూ భయంతో నెగెటివ్ సజెషన్స్ ఇచ్చుకోవద్దు. దానికి బదులు ‘నేను ఫస్ట్ క్లాసులో పాసవుతాను, నాకు 90 కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి’ అని కనీసం రోజూ ఇరవై ఒకటి సార్లు అనుకోండి. ఇరవై ఒకటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందుకే పుట్టిన బిడ్డకు 21 రోజుల తరువాత పేరు పెడతారు. యోగసాధనలో 21 పర్యాయాలు ఓంకారం ఉచ్చరిస్తారు. దానికి కారణం మన శరీరంలో 21 భాగాలు ఉంటాయి. అవేమిటంటే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచవాయువులు, 5 పంచాగ్నులు, ఒకటి చిత్తం. అవన్నీ కలిపితే 21. అందుకే ఇప్పటి నుండి రోజూ 21 సార్లు పైవిధంగా అనుకుంటే గతంలో అనుకున్న నెగిటివ్ సజేషన్లకు చెల్లు అయిపోతుంది. ఇదేదో మూఢనమ్మకంగా కొట్టిపడేయకండి. ఇప్పుడు సైకాలజిస్టులు ఇదే విషయాన్ని అఊఊఐఖకఅఖీఐైూ (అఫర్‌మేషన్స్) అనే పేరుతో సాధన చేయిస్తున్నారు. దీని వలన మనసు పాజిటివ్ ఆలోచనలవైపు పరుగెడుతుంది.

మర్చిపోవడం కూడా మంచిదే...

‘మాలతికి మతిమరుపు ఎక్కువ’ అని ఆమె తల్లి చెప్పింది. ఆ అమ్మాయి కూడా ‘అవును ఈ మధ్య ఏది చదివినా మర్చిపోతున్నాను. వారం రోజుల క్రితం చదివిన పాఠం ఇప్పుడు చదివితే అంతా కొత్తగా ఉంటోంది. నా మైండ్ పవర్ పూర్తిగా పోయింది. జ్ఞాపకశక్తికి ఏమైనా మందులున్నాయా?’ అని అడిగింది.

‘మందులేవీ లేవు. సరైన ఆహారం సక్రమంగా తీసుకుంటే చాలు. అది సరే నీకు ఏ విషయమూ గుర్తుండటం లేదా?’ అని అడిగితే-
 ‘అవును అస్సలు గుర్తుండటం లేదు’ అంది కాన్ఫిడెంట్‌గా!  ‘సరే! నువ్వీ మధ్య ఏ సినిమా చూశావ్?’ అని అడిగితే -
 ‘సినిమాలా? అవి చూసి ఆరునెల్లయ్యింది. పదవతరగతిలోకి వచ్చాక మా పేరెంట్స్ సినిమాలు వద్దు అన్నారు’ అంది బుంగమూతితో.
 ‘పోనీలే, నువ్వు చూసిన ఆఖరు సినిమా ఏమిటి?’ అని అడిగితే- ‘గబ్బర్ సింగ్’ అంది ఠపీమని.ఆ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర పాత్రధారుల పేర్లు.. ఆ సినిమా ముందు నుండి చివరిదాకా కథ అంతా చెప్పింది.. మధ్య మధ్యలో కొన్ని డైలాగులతో సహా!
 అన్నీ విన్నాకా ‘ఆరునెలల క్రితం చూసిన సినిమా అక్షరాలా కళ్లకు కట్టినట్లు చెప్పావు. మరి క్రిందటి వారం చదివిన పాఠం గుర్తుండటం లేదు. అదెలా సాధ్యం?’ అని అడిగితే- ‘అదే నా సమస్య’ అంటూ నవ్వింది. తన జ్ఞాపకశక్తి గురించి తనకే ఆశ్చర్యం వేసింది.

 6 ’ఖ’ టెక్నిక్...

చదివింది మరచిపోతే.. వారికి ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది
 
మొదటి ఖ చదివినప్పుడు పాఠంలోని అంతరార్థం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాఠాన్ని గతంలో విన్నారు. నోట్స్ కూడా రాసుకున్నారు. రెండవ ఖ వలన టెక్ట్స్ బుక్‌లోని బొమ్మలు, అర్థం కాని పదాలను అర్థాలు తెలుస్తాయి. మూడవ ఖతో పాఠం సారాంశం బోధపడుతుంది. 4వ ఖతో మీకు మీరు అప్పగించుకున్నట్లు అవుతుంది. 5వ ఖతో పాఠం గుర్తుంటుంది. 6వ ఖ అతి ముఖ్యమైనది. గుర్తున్నది పేపర్ మీద రాయాలి. పాఠం అంతా రాయనక్కర్లేదు. ముఖ్యాంశాలు చాలు. లేదా బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటే చాలు.
 పరీక్షల ముందు ఆ బుల్లెట్ పాయింట్స్ చదివితే మీరు కూడా బుల్లెట్ వేగంతో పై తరగతిలోకి వెళ్లటం ఖాయం.

 - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్,
bvpattabhiram@yahoo.com
 ఫోన్: 040-23233232, 23231123
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement