అప్పటి చాప్లిన్ నవల ఇప్పుడు! | Chaplin then the novel now! | Sakshi
Sakshi News home page

అప్పటి చాప్లిన్ నవల ఇప్పుడు!

Published Mon, Feb 24 2014 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

అప్పటి చాప్లిన్ నవల ఇప్పుడు!

అప్పటి చాప్లిన్ నవల ఇప్పుడు!

ఘనస్మృతి

చార్లీ చాప్లిన్‌పై లెక్కలేనన్ని పుస్తకాలు వచ్చాయి. అందులో నవలలు కూడా ఉన్నాయి. విశేషం ఏమిటంటే ‘ఫుట్‌లైట్స్’ పేరుతో చాప్లిన్ స్వయంగా ఒక నవల రాశారు.  1948లో   ఈ నవల రాశారు. నవలలో ప్రధాన పాత్ర...చాప్లిన్ సొంత అనుభవాల నుంచి పుట్టిందే. సినిమాల్లో పాత్రలు తగ్గి, ఆదరణ కోల్పోతున్న దశలో ఒక హాస్యనటుడి వేదనను ఈ నవల చిత్రించింది.

‘అరవై ఆరేళ్ళ క్రితం నాటి చాప్లిన్ నవల ఇప్పటి దాకా ఎందుకు ప్రచురించబడలేదు?’అనే సందేహం సహజంగానే వస్తుంది. దీనికి చాప్లిన్ జీవిత చరిత్రకారుడు డేవిడ్ రాబిన్‌సన్ చెప్పిన సమాధానం... ‘‘ప్రచురణ కోసం కాకుండా చాప్లిన్ తన కోసం తాను రాసుకున్న నవల ఇది. కాబట్టి ఆయన ఎప్పుడూ ప్రచురించే ప్రయత్నం చేయలేదు. ఈ నవలను ప్రజల్లోకి తేవడం వల్ల లేని పోని ఇబ్బందులు తలెత్తవచ్చని చాప్లిన్ కుటుంబసభ్యులు భావించి వారు కూడా ప్రచురణకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ భయాల నుంచి బయటకు వచ్చారు.’’

చాప్లిన్ చదువుకున్నది తక్కువ. కేవలం ఆరునెలలు మాత్రమే స్కూల్లో చదువుకున్నాడు. నవల చదివిన వారికి మాత్రం పెద్ద చదువులు చదువుకున్న చేయి తిరిగిన రచయిత రాసిన అనుభూతి కలుగుతుందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement