
వాతావరణ కాలుష్యం, ఆటోమొబైల్ కాలుష్యాలతో చర్మం, జుట్టుకు చాలా నష్టం. జుట్టు రాలిపోవడం కాలుష్యం వల్ల జరిగే సాధారణ పరిణామం. ఇది నగరాలు, పరిశ్రమలు, వాహనాల కాలుష్యం ఉన్న చోట్ల మరింత ఎక్కువ. ఈ అన్ని రకాల కాలుష్యాలతో జుట్టు బాగా బలహీనపడుతుంది. దాంతో వెంట్రుక తేలిగ్గా తెగిపోవడం, వెంట్రుకకు సహజంగా ఉండే మెరుపు తగ్గిపోవడం జరుగుతుంది. దుమ్మూధూళి వంటి కాలుష్యాల వల్ల జుట్టు చింపిరిగా మారడం వంటి దుష్పరిణామాలు కలగవచ్చు. ఈ అంశాలన్నీ కలగలసిన ప్రభావంతో వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటివి జరుగుతాయి.
కాలుష్యం నుంచి చర్మాన్ని, జుట్టును కాపాడుకోవడం ఎలా?
కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లౌజ్ వంటివి తొడుక్కోవాలి. ∙చర్మం, వెంట్రుకలు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
∙చర్మాన్ని, జుట్టును ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment