పెళ్లికూతురుగా సమ్‌థింగ్ డిఫరెంట్ లుక్ కావాలంటే ఇలా నార్త్ ఇండియా డ్రెస్సింగ్‌ని ట్రై చేయవచ్చు. స్కర్ట్ పార్ట్ మొత్తం ఫ్లోరల్ బెనారస్ ఫ్యాబ్రిక్ వాడారు. బెనారస్ అనేది ఎప్పటికీ ఫ్యాషన్‌లో ఉంటుంది. రెండు దుపట్టాలను తీసుకొని ఒకటి వెల్వెట్, మరోటి నెటెడ్ ఫ్యాబ్రిక్. వీటిపై ఎంబ్రాయిడరీ చేశారు. దీంట్లో నెట్టెడ్ దుపట్టాను ఓణీలా వేసి, తలమీదుగా తీయాలి. మరొక దుపట్టాను చేతుల మధ్య ధరించాలి. సంగీత్, మెహిందీ ఫంక్షన్లకు ఈ ఎంపిక రాచరికపు హంగులను తీసుకువస్తుంది.
► ఇది లాంగ్ గౌన్. ప్యూర్ క్రేప్ మెటీ రియల్‌తో డిజైన్ చేశారు. నెక్‌ను పూర్తిగా కవర్ చేసేలా డిజైన్, లాంగ్ ఫ్రిల్స్ స్లీవ్స్ ఈ డ్రెస్‌ను హైలైట్ చేశాయి. వేడుకలో వెరైటీగా వెలిగిపోతారు.
► ఇది వెరీ క్యాజువల్, ఫెస్టివ్ లుక్ అని చెప్పొచ్చు. మంచి రంగు క్రష్డ్ స్కర్ట్ మీదకు లేత రంగు కుర్తా వేసుకోవాలి. డిఫరెంట్ లుక్ రావడానికి బెల్ట్ పెట్టుకుంటే చాలు. లుక్‌తో అదరగొట్టేస్తారు. పండుగలు, చిన్న చిన్న పార్టీలకు ఇలాంటి డ్రెస్సింగ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
► హెవీ క్రేప్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ చేసిన సింగిల్ పీస్ డ్రెస్ ఇది. పొడుగ్గా, సన్నగా ఉన్నవారికి భిన్నంగా కనిపించాలనుకునేవారికి ఈ తరహా డ్రెస్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈవెనింగ్ సమయంలో బర్త్‌డే, థీమ్ పార్టీస్‌కి ఈ డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
► మిక్స్ అండ్ మ్యాచ్ స్టైల్ ఇష్టపడేవారికి ఈ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. కింద మంచి ఫిటెడ్ స్కర్ట్ వేసుకోవాలి. దాని పైన లూజ్ టీ షర్ట్ వేసుకోవాలి. స్వెట్ షర్ట్స్ కూడా బాగుంటాయి. ఇది చాలా క్యాజువల్ స్టైల్. ఇది స్పెషల్ పార్టీస్‌కి, ఆఫీస్ మీటింగ్స్‌కి కూడా ఈ లుక్ చాలా బాగుంటుంది. ఇది ఫార్మల్ వేర్ అండ్ పార్టీవేర్‌గానూ పనికొస్తుంది.
► ఇది చాలా హై ఫ్యాషన్ డ్రెస్. డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. ఫిష్‌కట్ స్టైల్. లాంగ్ స్లీవ్స్, బాటమ్‌గా పాయింట్‌ని ఎంచుకున్నారు. పొడవుగా, సన్నగా ఉన్నవారికి ఈ తరహా డ్రెస్సింగ్ బాగుంటుంది. స్పెషల్ ఈవెంట్స్, కాక్‌టెయిల్ పార్టీలకు ఈ డ్రెస్ బాగా నప్పుతుంది.
► ఇది బెనారస్ శారీ. ఏ వయసు వారైనా, ఏ చిన్న వేడుకకైనా, పెద్ద ఈవెంట్‌లోనైనా కట్టుకున్నా చాలా బ్రైట్‌గా వెలిగిపోతారు. మీ వార్డ్‌రోబ్‌లో ఒక్క బెనారస్ శారీని చేర్చుకుంటే దీనిని వచ్చే తరానికి మీరు కానుకగా ఇవ్వొచ్చు. మన్నిక కూడా అంత బాగుంటుంది.
- భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment