నేను గత నాలుగేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఈసారి వేసవి సెలవల్లో ఎటైనా విహారయాత్రకు వెళ్దామనుకుంటున్నాను. ప్రయాణంలో నా చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోడానికి ఏవైనా సూచనలు చెప్పండి.
- కె. శ్రీధర్, చీరాల
డయాబెటిస్ ఉన్నంత మాత్రాన విహారయాత్రలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం మానుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... మీరు వెళ్లబోయే ప్రదేశం ఏమిటో, అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుందో మీ డాక్టర్‌కు చెప్పండి మీ డయాబెటిస్ మందులతో పాటు ఒకవేళ మీకు ప్రయాణం సమయంలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాల సమస్య వస్తే తీసుకోవాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్‌ను ఇవ్వమని కోరండి మీరు మీ గమ్యస్థానాన్ని చేరగానే ఒకసారి మీ చక్కెర పాళ్లు పరీక్షించుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చేరాల్సిన ఆసుపత్రినీ, లేదా వైద్యసహాయం అందించే చోటును ముందే ఎంపిక చేసుకుని పెట్టుకోండి.
మీరు ఇన్సులిన్ మీద ఉంటే ఇన్సులిన్‌ను లేదా నోటి ద్వారా తీసుకునే మందులైతే వాటిని మీతో పాటే ఉంచుకోండి. మీ ఇన్సులిన్ మరీ ఎక్కువ వేడి ఉండే చోట లేకుండా చూసుకోండి మీరు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేసుకోండి అకస్మాత్తుగా రక్తంలో చక్కెర తగ్గే పరిస్థితి ఏర్పడితే తీసుకోడానికి కొన్ని చాక్లెట్లు కూడా మీతో ఉంచుకోండి.
డాక్టర్ కె.డి. మోదీ
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
డయాబెటిక్ కౌన్సెలింగ్
Published Mon, May 25 2015 11:21 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement