ఒకరు ధరించిన పాదరక్షలు, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పూలదండ, కమండలం– వీటిని మరొకరు ధరించరాదు.
ఒకరు ధరించిన పాదరక్షలు, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పూలదండ, కమండలం– వీటిని మరొకరు ధరించరాదు. శనివారం నాడు, అమావాస్య నాడు ఇంటిని శుభ్రం చేసి, మనకు అవసరం లేని వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల దరిద్రం తొలగి, సంపదలు కలుగుతాయి. చతురంగ బలాలంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు. వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రతి బుధ, శనివారాలలో శ్రీమహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించడం వల్ల త్వరలో వివాహం అవుతుంది.
మాసిన, చిరిగిన వస్త్రాలను ధరించిన వారిని, పళ్లు తోముకోనివారిని తిండిపోతును, నిష్ఠూరంగా మాట్లాడేవారిని, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోయేవారిని, స్త్రీలను నిందిస్తూ, వారి దుఃఖానికి కారకులైనవారిని లక్ష్మీదేవి పరిత్యజిస్తుంది. చిల్లర నాణేలు కదా అని చులకనగా చూడకూడదు. కరెన్సీ నోట్లను నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా నలిపి పర్సులో పెట్టుకోరాదు.