గురువు ముల్లా అహ్మద్ జీవన్ తన శిష్యుడైన మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో.. ‘మీరు ఇచ్చిన పావలా బిళ్ల ఎంతో శుభప్రదమయినదిగా రూపుదాల్చింది. నేను దానితో పత్తిగింజలు కొని పత్తి పండించాను. దైవం ఎంతో బర్కత్ (శుభాన్ని) ఇచ్చాడు. కొన్నేళ్లలో వందలు, లక్షలుగా మారాయి’’ అని చెప్పాడు. ఔరంగజేబు అది విని చాలా సంతోషించాడు.‘‘మీరు అనుమతిస్తే ఆ పావలా బిళ్ల గాథ వినిపిస్తాను’’ అని అన్నారు ఔరంగజేబు. ‘‘తప్పక వినిపించండి’’ అన్నారు ముల్లా జీవన్. అప్పుడు ఔరంగజేబు తన నౌకరుకు, ‘చాందినీచౌక్‌లోని సేఠ్ ఉత్తమ్‌చంద్ ని ఫలానా తారీఖు ఖాతాతో సహా ప్రవేశపెట్టమని’ పురమాయించాడు. సేఠ్ ఉత్తమ్‌చంద్ వచ్చి ఖాతా తెరచి వివరించసాగాడు. ముల్లా జీవన్, చక్రవర్తి ఇద్దరూ చెవులొగ్గి వింటున్నారు. ఓ చోట సేఠ్ ఆగిపోయాడు. అక్కడ పావలా అని రాసి ఉంది కాని, దాని వివరాలేమీ లేవు. ఔరంగజేబు మృదువుగా అడిగాడు, ఆ పావలా ఏమయింది? అని. ‘అనుమతిస్తే దాని బాధాకరమయిన గాథ వినిపిస్తా’’నన్నాడు సేఠ్. అనుమతించారు. ‘‘ఓ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది. నా ఇల్లు కూడా కురవడం మొదలయింది. నా పద్దు పుస్తకాలన్నీ అందులోనే ఉన్నాయి.
నేనెంత ప్రయత్నించినా ఇల్లు కురవడాన్ని ఆపలేకపోయాను. బయటకు తొంగిచూశాను. ఓ వ్యక్తి వీధి లాంతరు కింద నిలబడి కనిపించాడు. నేనతన్ని ‘సాయం చేస్తావా?’ అని అడిగాను. అతను చేస్తానని అన్నాడు. నాలుగయిదు గంటలపాటు కష్టపడి ఇంటి మీది పెంకులను సర్ది, అతి కష్టం మీద వాన నీరు లోపల కురవకుండా ఆపడంతోపాటు లోనికి వచ్చి సామానంతా సర్దాడు కూడా. అంతలో తెల్లవారు అజాన్ అయింది. అతను సెలవు తీసుకున్నాడు. నేను అతనికి కూలీ ఇవ్వాలనుకున్నాను. జేబులో పావలా తప్ప ఏమీ లేదు. అతనితో ‘బాబూ! ప్రస్తుతం ఈ పావలా తీసుకుని పొద్దున నా షాపుకు వస్తే పూర్తి కూలీ ఇస్తా’నని అన్నాను. అతను, ‘నాకు ఈ పావలా చాలు, నేను మళ్లీ రాలేను’ అని చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లే ముందు నేనూ, నా భార్య ఎంతో ప్రాధేయపడ్డాము పొద్దున రమ్మని. కాని అతను రాలేదు.. అని ఇదంతా వివరించి ఉత్తమ్‌చంద్ వెళ్లిపోయాడు. చక్రవర్తి ముల్లా గారితో చెప్పాడు, ‘ఆ చవన్నీ’ (పావలా బిళ్ల) అదే!’ అని!!‘ నేను ప్రతిరోజు మాదిరిగానే మారువేషంలో ప్రజల బాగోగులు విచారించడానికి వెళ్లగా ఇది సంభవించింది అని చెప్పాడు ఔరంగజేబు చక్రవర్తి. (ఆ పావలానే ఔరంగజేబుకు తన గురువుకు ఇచ్చారు).
ఈ పావలా చాలు
Published Fri, May 25 2018 12:23 AM | Last Updated on Fri, May 25 2018 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment