పేదింటి పెరటి కాయ .. సొరకాయ... | Gourd, bottle gourd yard pedinti .. .. | Sakshi
Sakshi News home page

పేదింటి పెరటి కాయ .. సొరకాయ...

Nov 17 2015 11:05 PM | Updated on Sep 3 2017 12:37 PM

పేదింటి పెరటి కాయ .. సొరకాయ...

పేదింటి పెరటి కాయ .. సొరకాయ...

సొరకూయతో పులుసు పెడితే ఒక రుచి, సాంబారులో వేస్తే మరో రుచి, టొమాటో వేసి కూర వండితే ఆహా రుచి, వడియాలు పెడితే

తిండి గోల
 

సొరకూయతో పులుసు పెడితే ఒక రుచి, సాంబారులో వేస్తే మరో రుచి, టొమాటో వేసి కూర వండితే ఆహా రుచి, వడియాలు పెడితే కరకరలాడుతూ అన్నంలోకి నంజుకుంటే అదో రుచి, స్వీట్లు చేస్తే మహా రుచి... తెలంగాణ రాష్ట్రంలో అనపకాయగా పేరున్న సొరకాయ మన దేశంలో వేదకాలం నుండి సాగుచేస్తున్న జాతి కూరగాయ. ఇంటి పెరట్లో పెట్టి వదిలేసినా, ఏ మాత్రం పోషణలేకపోయినా విరగగాస్తుంది. అన్ని నేలల్లోనూ ఏపుగా పెరిగే గుణం సొరకు ఉంది.

దీని మూలాలు ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీ.పూ 11 వేల సంవత్సరాంతంలో మన దగ్గర సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొటీన్లు, పిండిపదార్థాలు, ఎ-సి విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉన్న సొరకాయ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఎండిన సొరకాయ బుర్రలో నీళ్లు పోసి, ఉంచితే కాసేపటికే చల్లగా అవుతాయి. అందుకే పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్లేవారు తాగడానికి నీళ్లు తీసుకెళ్లాలంటే వీటినే వాడేవారు. ఇక గుండ్రని సొరబుర్రలనైతే వీణలుగా కూడా ఉపయోగిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement