చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు యౌవనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలు...
ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ.
ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మాన్ని మెరుస్తూ ఉండేలా చేస్తాయి. చర్మాన్ని నునుపుగా చేస్తాయి.
ఆహారం: ముడిబియ్యం, పొట్టు తీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్... వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ.
ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపుతాయి. ఇందులోని పీచుపదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి.
ఆహారం: విటమిన్–బి6 ఎక్కువుండే ఆహారమైన క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో.
ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యం వల్ల వచ్చే మొటిమలను విటమిన్–బి6 నివారిస్తుంది. హార్మోన్‌ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా చూస్తుంది.
తాజా పండ్లు: అన్ని రకాల తాజాపండ్లలో విటమిన్లతోపాటు యాంటీ–ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి ఉపయోగపడతాయి. యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి.
చర్మం గ్లో తగ్గించే పదార్థాలు:ఈ తరహా ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. మితిమీరి తీసుకుంటే కీడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఇవి తీసుకునే సమయంలో విచక్షణతో ఉండాలి. ఈ ఆహారం వివరాలివి...
ఆహారం: కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్.
చేటు: వీటిల్లో కెఫిన్‌పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారేలా చేస్తుంది.
ఆహారం: చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, తీపి పానీయాలు.
చేటు: తీపి ఎక్కువగా ఉండే ఆహారాల వల్ల ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. మొటిమలు వస్తాయి.
ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్‌డ్ ఫుడ్.
చేటు: ఇందులోని అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడతలు పడేందుకు దోహదం చేస్తాయి.
ఆహారం: నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు.
చేటు: ఇందులో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment