మంచుదిబ్బలపై టార్పాలిన్‌లు
ఇటలీలో మంచుదిబ్బలు, మండుటెండలు జోడీగా ఉంటాయి. ఇప్పుడక్కడ సమ్మర్. కొద్ది కొద్దిగా హీటెక్కుతోంది. జూలైలో నడివేసవి. భగభగలు మొదలౌతాయి. వేడి 42 కి రీచ్ అవుతుంది. అది గరిష్టం. జనం ఏసీలు కప్పుకుంటారు. మంచు దిబ్బలకే ప్రాబ్లమ్. ఎండ తీవ్రతకు కరుగుతుంటాయి పాపం. అవి ఉంటేనే స్కీయింగ్, కేబుల్ కార్ స్వారీయింగ్. ఆటల కోసం కాకున్నా మంచును మంచుగానే ఉంచడం కోసం ప్రతి వేసవిలో ఈ దిబ్బలపై టార్పాలిన్‌లు కప్పి మంచు కరిగే వేగాన్ని తగ్గిస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా అక్కడి ప్రసేనా గ్లేసియర్ (మంచుదిబ్బ) పై టార్పాలిన్ వస్త్రాన్ని పరుస్తున్నారు. ఈ ఏడాది మరికొంచెం ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. అంత భారీ ఏక వస్త్రం దొరకడమూ కష్టమే, పరవడమూ కష్టమే. అందుకే 70 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండే టార్పాలిన్ షీట్‌లను కలిపి కుట్టి, ప్రసేనా గ్లేసియర్‌పై పరిచి, పొడిగాలులకు ఎగరకుండా ఇసుక బస్తాల బరువు పెడుతున్నారు. ప్రకృతి నుంచి ప్రకృతిని కాపాడుకోడానికి మనిషి పడుతున్న పాట్లు ఇవి. 1993 నుంచి ఇప్పటివరకు ప్రసేనా గ్లేసియర్‌లో మూడో వంతు భాగం ఎండల వేడికి తగ్గిపోతూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment