రావి రంగారావు సాహిత్య పీఠం జన రంజక కవి పురస్కారాలను ఫిబ్రవరి 10న సా. 6 గం.కు గుంటూరులోని అన్నమయ్య కళావేదికలో ప్రదానం చేస్తారు. గ్రహీతలు: మెట్టా నాగేశ్వరరావు (మనిషొక పద్యం), కరీముల్లా (ఎదురు మతం), మందరపు హైమవతి (నీలి గోరింట), కన్నెగంటి వెంకటయ్య (మమతల హృదయాలు), ఎరుకలపూడి గోపీనాథరావు (భావనా తరంగాలు).
- సిరికోన – మహాంధ్రభారతి సాహిత్యోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఇందులో బులుసు వేంకటేశ్వర్లు ‘నీలమోహనం’ ఆవిష్కరణ, సిరికోన భారతి వ్యాస సంపుటి (సం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి) ఆవిష్కరణ కానున్నాయి. గంగిశెట్టి స్మారక ఉత్తమ అనువాదక పురస్కారాన్ని డాక్టర్ కోడూరి ప్రభాకర రెడ్డికీ; రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితా సంపుటి పురస్కారాన్ని దేవనపల్లి వీణావాణికీ; చెన్నరాయ కిశోర్ స్మారక తెలుగు తేజో స్ఫూర్తి పురస్కారాన్ని దేశముఖ్ ప్రవీణ్ శర్మకూ ప్రదానం చేయనున్నారు.
- తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’పై పరాంకుశం వేణుగోపాల స్వామి ప్రసంగిస్తారు. అధ్యక్షత: నందిని సిధారెడ్డి.
- భూతపురి సాహిత్య పురస్కారాన్ని గండ్లూరి దత్తాత్రేయ శర్మకు ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడపలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్ ట్రస్ట్, అల్లసాని పెద్దన సాహిత్య పీఠం.
- అనిల్ డ్యానీ కవితా సంపుటి స్పెల్లింగ్ మిస్టేక్ పరిచయ సభ ఫిబ్రవరి 16న సా. 6 గంటలకు సీసీవీఏ, మొఘల్రాజపురం, విజయవాడలో జరగనుంది.
- అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా గుడిపల్లి నిరంజన్ రాసిన ‘నిట్టాడి’ దీర్ఘ కవిత ఆవిష్కరణ ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్, సి.యన్.రెడ్డి సేవాసదన్‌లో జరగనుంది. ఆవిష్కర్త గోరటి వెంకన్న. నిర్వహణ: పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక, నాగర్‌కర్నూల్.
Comments
Please login to add a commentAdd a comment