త్రీమంకీస్ - 27 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 27

Published Fri, Nov 14 2014 11:17 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

త్రీమంకీస్  -  27 - Sakshi

త్రీమంకీస్ - 27

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 27
 
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘చాలా. గ్లవ్స్ తెలుసుగా?’’
‘‘తెలుసు. చేతికి తొడుక్కుంటాం.’’
‘‘దానికి ‘ఫింగర్ పేంట్స్’ అనే కొత్త పేరుని కనుక్కున్నాను. ముందు అమెరికాలో, తర్వాత కొద్దికాలం తర్వాత మన దేశంలో కూడా దాన్ని అలాగే పిలుస్తారు.’’
 ‘‘వావ్!’’
 ‘‘వల్కనో తెలుసుగా?’’
 ‘‘అగ్ని పర్వతం.’’
 ‘‘దానికి ‘మౌంటెన్ ఫౌంటెన్’ అనే పేరు కనుక్కున్నాను. జపాన్‌లో అది ప్రాచుర్యం చెందుతోంది. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఫ్రెంచ్ లేదు. కాబట్టి దానికి ‘ఫింగర్ పొటాటోస్’ అనే పేరు కనుక్కున్నాను.’’
 ‘‘మీరు గ్రేటండి.’’
 ‘‘ఐస్‌క్యూబ్స్‌కి ‘వాటర్ విత్ కార్నర్స్’ అనే పేరు కనుక్కున్నాను. స్టార్‌కి ‘స్పేస్‌లైట్’ అనే పదాన్ని కనుక్కున్నాను.’’
 ‘‘బావున్నాయి. మీరు చాలా గ్రేట్ అండి’’ కపీష్ మెచ్చుకున్నాడు.
 ‘‘కంప్యూటర్‌కి ‘ఇంటర్నెట్ మెషీన్’ అనే పేరు పెట్టాను. అది అమెరికాలో పాపులర్ అవుతోంది. లావుపాటి వాళ్ళని ఫాట్ అనకుండా ‘స్కిన్నీ’ అనాలి.’’
 ‘‘ఇది మాత్రం అర్ధం కాలేదు. నాకు తెలిసి సన్న వాళ్ళని స్కిన్నీ అంటారు.‘‘
 ‘‘కదా? అది తప్పు. సన్నపాటి వాళ్ళ కన్నా లావుపాటి వాళ్ళకే ఎక్కువ స్కిన్ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళని స్కిన్నీ అనడం కరెక్ట్. యుఎస్‌ఏలో బాత్‌రూంలని రెస్ట్‌రూమ్స్ అంటారు. నిజానికి బెడ్ రూమ్స్‌ని రెస్ట్‌రూమ్స్ అనాలి అని నా ప్రాజెక్ట్‌లో రాశాను. ప్రెగ్నెంట్ విమెన్‌ని ‘బాడీ బిల్డర్’ అనాలి. ఫన్ సైజ్ కేండీ బార్స్‌ని సేడ్ సైజ్ కేండీ బార్స్ అనాలి. నెత్తి మీది జుట్టుని ‘పబ్లిక్ హెయిర్’ అనాలి. మోకాలు వెనక భాగానికి ఇంతదాకా అసలు పేరే లేదు. దానికి ‘నీపిట్స్’ అనే పేరుని కనుక్కున్నాను.’’
 ‘‘ఒంటెని ‘డిజర్ట్ రేట్’ అనచ్చుగా?’’ కపీష్ తన తెలివిని ఉపయోగించాడు.
 ‘‘వావ్!’’
 ‘‘టిష్యూలని ‘స్నీజ్ పేపర్’ అనచ్చుగా?’’ తమ ఎదురుగా ఉన్న పేపర్ టిష్యూలని చూని సూచించాడు.
 ‘‘మళ్ళీ వావ్! మనం ఒకేలా ఆలోచించే సిమిలర్ మైండ్ కలవాళ్ళం అని నాకు అనిపిస్తోంది. వి షుడ్ కీప్ సీయింగ్ ఈచ్ అదర్ ఆఫ్టెన్. బై ది వే, నా రీసెర్చ్‌లో ఇంగ్లీష్‌లో ప్రాచుర్యంలో లేని పదాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఓ భాగం. ఉదాహరణకి డైసానియా అనే పదం అర్థం మీకు తెలుసా?’’
 ‘‘తెలీదు.’’
 ‘‘చూశారా? మీరా స్థితిని అనుభవిస్తారు కాని మీకు అర్థం తెలీదు. ఉదయం నిద్ర లేచాక మంచం దిగడానికి కష్టంగా ఉండటాన్ని డైసానియా అంటారు.’’
 ‘‘వావ్!’’
 ‘‘పెట్రోబోర్ అంటే?’’
 ‘‘పెట్రోల్‌తో నడిచే కారా?’’
 ‘‘కాదు. వర్షం వచ్చాక వేసే వాసన. టిటిల్ అంటే, ఇంగ్లీష్‌లోని స్మాల్ ఐ, జె అక్షరాల మీది చుక్కలు. డైపుస్కలర్ రేస్ అంటే మబ్బుల్లోంచి ఒకే చోటి నించి వస్తున్న సూర్య కిరణాలు. దీన్ని గాడ్స్ రేస్ అని కూడా అంటారు. ఫైల్ అంటే తెలుసా? పెన్సిల్ చివరి భాగంలో చుట్టబడ్డ మెటల్ భాగం. ముంటిన్ అంటే కిటికీ తలుపుల్లోని అద్దాలని విడదీసే స్ట్రిప్స్. ’మోర్టన్స్ టో’ అంటే కాలి బొటన వేలు కన్నా దాని పక్క పొడుగ్గా ఉన్న వేలు. ‘ఆర్మ్స్ ఎకింబో’ అంటే రెండు చేతులని నడుముకి అటు, ఇటు వేసి నిలబడటం. డ్రానక్ అంటే చెప్పుల షాపులో కాలి పాదాన్ని కొలిచే పరికరం. ‘డిజైర్ పాత్’ అంటే, నడిచే అడ్డ దారి. ఫాస్‌ఫెనెస్ అంటే తెలుసా?’’
 ‘‘కనీసం దాని స్పెల్లింగ్ కూడా తెలీదు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘కళ్ళు మూసుకుని వాటి మీద చేతులని ఉంచి నలిపితే చాలా లైట్‌గా కనపడే లైట్‌ని ఫాస్‌ఫెనెస్ అంటారు.’’
 ‘‘అందుకే మీరు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేయగలుగుతున్నారు’’ మెచ్చుకున్నాడు.
 ‘‘మా ప్రొఫెసర్ ఇచ్చే ప్రోత్సాహం, గెడైన్స్ అలాంటిది. మెడికల్ టెక్ట్స్ బుక్స్ చదవమని సలహా ఇచ్చారు. ఫిల్‌ట్రమ్ అంటే ఏమిటో తెలుసా?’’
కపీష్ తల అడ్డంగా ఊపాడు.

‘‘పెపైదవి అంచు, ముక్కు కింద ఉన్న మీసం వచ్చే భాగం. ‘పర్లీక్యూర్ స్పేస్’ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్య గల ఖాళీ. ఏగ్‌లెట్ అంటే షూ లేస్ మీద గల ప్లాస్టిక్ కోటింగ్. అలాగే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వారిని కలిస్తే చాలా పదాలు తెలిశాయి. సుత్తిని కొడతాం కదా? దాని వెనక భాగాన్ని పీన్ అంటారు. బట్టల తయారీ వాళ్ళని కూడా కలిశాను. ఆడవారి గౌనులో చేతులు పట్టే రంధ్రాలని ఆర్మ్‌స్కై అంటారు.’’
 కపీష్‌కి తనకి తెలీకుండానే ఆమెతో అరవై నిమిషాలు ఐదు నిమిషాల్లా గడిచిపోయాయి. మార్వాడీ దగ్గర అప్పు తీసుకున్న వెయ్యి రూపాయల్లో ఆ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రం తెలిసి ఖర్చయ్యాయి.
   
మర్నాడు అదే మాల్‌లో ఐమేక్స్‌లో కలిశారు. ఆమె శానిటైజర్ తీసి తన సీట్లో, కపీష్ సీట్లో కొట్టి చెప్పింది.
 (‘మై ఫాంటసీ ఈజ్ టు హేవ్ టు మెన్’  అంది స్వచ్ఛ - ఎందుకు అనేది రేపు చూడండి....)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement