త్రీమంకీస్ - 28 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 28

Published Sat, Nov 15 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

త్రీమంకీస్ - 28

త్రీమంకీస్ - 28

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 28
- మల్లాది వెంకటకృష్ణమూర్తి


‘‘అనేకమంది కూర్చున్న సీట్ కదా.’’
 ‘‘అవును. క్లీన్లీనెన్  ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెన్.’’
 ‘‘కదా. మీరు నాకు నచ్చారు.’’
 ‘‘ఐతే నేను చెప్పే నాలుగు ఇంగ్లీష్ పదాలకి వ్యతిరేక పదాలని వెంటనే చెప్పండి చూద్దాం. ఇంగ్లీష్ తెలిసిన ఎవరికైనా ఆ వ్యతిరేక పదాలు తెలిసే ఉంటాయి.’’
 ‘‘ష్యూర్’’ స్వచ్ఛ ఉత్సాహంగా చూసింది.
 ‘‘యు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఐ.’’
 ‘‘హేట్.’’
 ‘‘లవ్.’’
 ‘‘ఐ.’’
 ‘‘యు.’’
 ‘‘నెవర్.’’
 ‘‘ఆల్వేస్’’
 ఇప్పుడు కలిపి చెప్పండి.’’
 ‘‘ఐ లవ్ యు ఆల్వేస్’’
 ‘‘థాంక్స్ ఫర్ లవింగ్ మీ ఆల్వేస్’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు.
 ‘‘తెలివే.’’
 ఆమె సన్నగా నవ్వింది. ఆమె టి షర్ట్ మీది అక్షరాలని కపీష్ గమనించాడు.
 పర్‌ఫెక్ట్ క్రైమ్
 ఐ స్టోల్ యువర్ హార్ట్. యు స్టీల్ మైన్.
 ‘‘మీ ఫాంటసీ ఏమిటి? మై ఫాంటసీ ఈజ్ టు హేవ్ టు మెన్’’ అడిగింది.
 ‘‘ఓ!!!’’ అతని గొంతు పొలమారింది.
 ‘‘ఒకరు కుకింగ్‌కి. మరొకరు క్లీనింగ్‌కి. మీకా రెండూ వస్తే మీ ఒక్కరితోనే సరిపెట్టుకుంటాను’’ స్వచ్ఛ నవ్వింది.
 ఇద్దరూ కలిసి ఇంటర్వెల్‌లో ఒకే ఐస్‌క్రీం కోన్‌ని షేర్ చేసుకున్నారు. ఆమె దాని మీద సేనిటైజర్‌ని చల్లాకే తినసాగింది. సినిమా అయ్యాక మర్నాడు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆమె తల్లితండ్రులు ఇంట్లో ఉండరని చెప్పాక అది ఆమెతో తను పాల్గొనబోయే సెక్స్‌కి ఆహ్వానంగా భావించిన కపీష్ తను పెట్టిన ఖర్చు వృథా కాలేదు అనుకున్నాడు.
 ‘‘రేపు నేను ఫ్రీనే. తప్పక వస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు.
 ‘‘మీరు కుక్కని పెంచుతున్నారా?’’ అడిగింది.
 ‘‘లేదు. ఏం?’’
 ‘‘కుక్క బొచ్చు మీ చర్మానికి అంటుకుని మళ్ళీ నా చర్మానికి అంటుకుంటుందని!’’
   
 మర్నాడు మధ్యాహ్నం రెండుకి సైనిక్‌పురిలోని ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపు బయట ‘దయచేసి మీ పాదరక్షలని బయటే వదలండి. సాక్స్ కూడా’ అనే బోర్డ్, ఆ వాక్యం పక్కనే నవ్వు మొహం బొమ్మ కనిపించడంతో వాటిని వదిలి లోపలకి వెళ్ళాడు. ఇంట్లో ఓ సర్వెంట్ అతను సాక్స్‌ని, పాదరక్షలని వదిలాడా? లేదా అని పర్యవేక్షించి, అతనికి ఓ కేప్‌ని ఇచ్చాడు.
 ‘‘ఇదేమిటి?’’ కపీష్ అర్థంకాక అడిగాడు.
 ‘‘షవర్ కేప్ సర్.’’
 ‘‘దేనికి?’’
 ‘‘తలకి పెట్టుకోండి. లేదా ఇంట్లో మీ జుట్టు రాలి పడచ్చు. మీకు కర్చీఫ్ ఉందా?’’
 ‘‘పెన్, కర్చీఫ్, దువ్వెన లాంటివి జేబుల్లో ఉంచుకుని తిరగను.’’
 ఓ కర్చీఫ్ ఇచ్చి చెప్పాడు - ‘‘తుమ్మితే ఉపయోగించుకోడానికి. లేదా నేలంతా పాడవుతుంది.’’
 స్వచ్ఛ అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి ఇల్లు చూపించింది. ఇల్లు అద్దంలా శుభ్రంగా, పొందికగా ఉంది. పనిమనిషి ఇల్లు ఊడుస్తూ కనిపించింది.
 ‘‘పని మనిషి ఇవాళ లేట్‌గా వచ్చినట్లుంది?’’ తమ ఏకాంతానికి ఆమె భంగం అనుకుంటూ అడిగాడు.
 ‘‘లేదే. ఎందుకలా అడిగారు?’’ స్వచ్ఛ ప్రశ్నించింది.
 ‘‘అందరిళ్ళల్లో పనిమనుషులు ఉదయమే వస్తారుగా?’’
 ‘‘మాకు ముగ్గురు పనిమనుషులు. ఉదయం ఓ పనిమనిషి, మధ్యాహ్నం ఓ పనిమనిషి, సాయంత్రం ఓ పనిమనిషి వస్తారు.’’
 ‘‘ఎందుకలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘ఊడ్చి తడి బట్ట వేసి నేలని తుడవాలి. లేదా ఇంట్లో మట్టి మట్టి.’’
 ‘‘రోజుకి మూడుసార్లు?’’
 ‘‘ ఔను. రోజుకి మూడుసార్లు. ఆదివారాలు వచ్చి కిటికీ చువ్వలు, ఫ్రేమ్‌లు, తలుపులు, ఫాన్లు, సీలింగ్ తుడిచేవాడు ఇంకోడున్నాడు.’’
 ‘‘నిజంగా మీరు గ్రేట్ అండి.’’
 ‘‘గ్రేట్ కాదు. క్లీన్‌లీనెస్ ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెస్ అని నమ్మేదాన్ని.’’
 పనిమనిషికి అర్థం కాకుండా ఇంగ్లీష్‌లో చెప్పింది.
 ‘‘మనం ప్రేమలో పడ్డాం కాబట్టి చాలా చేయాలి.’’
 ‘‘నేను అందుకు ఎప్పుడూ సిద్ధమే’’ ఉత్సాహంగా చెప్పాడు.
 అకస్మాత్తుగా ఆమె కెవ్వున అరుస్తూ లేచింది. ‘ఏమిటి?’ అని అడుగుతూ కంగారుగా కపీష్ కూడా లేచాడు.
 
- మళ్లీ  రేపు
 
ఈ సీరియల్‌ని విడవకుండా చదివేవారికి..
సీరియల్ పూర్తయ్యాక దీని మీద రాసి పంపే సద్విమర్శ లేదా విశ్లేషణల్లోంచి మూడింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. వారికి రచయిత తలో రూ.500/- పంపుతారు.
 
ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలని మీ ఫొటోతోపాటు ఈ కింది చిరునామాకి పంపండి.మీరు ఇరవై ఒకటో శతాబ్దపు పాఠకులైతే 3monkies.sakshi@gmail.com కి మీ ఫోటోని అటాచ్ చేస్తూ పంపండి. మీరు ఇంకా అక్కడే ఉంటే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో సహా ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34
 
లెటర్స్
* మూడు కోతులు ముచ్చటగా ఉన్నాయి. సంభాషణలు తూటాల్లా దూసుకుపోతున్నాయి.- ఎం. శ్రీనివాసులు రెడ్డి, పీలేరు
* సోషల్ నెట్‌వర్క్‌లో పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం ఎంత కష్టమో
 మంచి కామెడీగా రాశారు. ఇది అందరూ అనుభవించే బాధ.
 - నరేంద్ర (narendranaidukundavarapu@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement